ఈ నూనెతో జుట్టు పెరగడం ఖాయం?

Purushottham Vinay
మన ఇంట్లోనే ఒక నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం జుట్టు రాలడాన్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఒత్తుగా పెంచే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ నూనెను తయారు చేసుకోవడానికి మనం కొబ్బరి నూనెను అలాగే మర్రి చెట్టు ఊడలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మర్రిచెట్టు ఊడలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మనకు చాలా బాగా ఉపయోగపడతాయి.మర్రిచెట్టు ఊడలను తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడగాలి. ఆ తరువాత వీటిని రెండు నుండి మూడు రోజుల పాటు అలాగే ఎండబెట్టాలి.ఇంకా ఈ మర్రి ఊడలు పూర్తిగా ఎండిన తరువాత వాటిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత వీటిని పొడిగా చేయాలి. అయితే ఈ మర్రి ఊడలు పూర్తిగా పొడిలా అవ్వవు. ఇవి కొద్దిగా బరకగానే ఉంటాయి. ఇక కళాయిలో 100 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేయాలి. అందులో మిక్సీ పట్టుకున్న మర్రి ఊడల పొడిని వేసి కలపాలి.


వీటిని చిన్న మంటపై పూర్తిగా నల్లగా అయ్యే దాకా వేయించాలి.ఆ మర్రి ఊడలు నల్లగా మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చల్లారనివ్వాలి. ఆ తరువాత ఈ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు.ఇక ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. ఆ తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా కొంచెం సేపు సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇంకా అలాగే ఈ నూనెను రోజంతా కూడా మన జుట్టుకు ఉంచుకోవచ్చు లేదా రాత్రి పడుకునే ముందు ఈ నూనెను జుట్టుకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేస్తే మంచిది. ఇక ఇలా మీరు వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అంతేగాక జుట్టు ఒత్తుగా, నల్లగా మర్రి బాగా పొడవుగా, అలాగే ధృడంగా పెరుగుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ నూనెని తయారు చేసుకొని దాన్ని జుట్టుకు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు జుట్టు రాలే సమస్య చాలా ఈజీగా తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: