బొప్పాయి: ఇలా ఉపయోగిస్తే సూపర్ బ్యూటీ మీ సొంతం?

Purushottham Vinay
బొప్పాయి పండు మన చర్మ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన బొప్పాయి పండు మనకు అన్ని సీజన్లలో కూడా లభిస్తుంది. వీటిలో ఉండే పోషకాలు ఇంకా ఔషధ గుణాలు  ఎంతో ఉపయోగకరం ఇంకా అలాగే ఆరోగ్యదాయకంగా ఉంటాయి.ఈ బొప్పాయిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అలాగే బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని ఈజీగా పెంచుతాయి. ఇంకా అలాగే కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె జబ్బులను కూడా శాశ్వతంగా మాయం చేస్తుంది. అలాగే క్యాల్షియం, పాస్ఫరస్ ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, గంధకం ఇంకా క్లోరిన్ వంటి పోషకాలు తగిన మోతాదులో కలిగిన బొప్పాయి మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో సహాయం చేస్తుంది.కొద్దిగా బియ్యప్పిండిని తీసుకొని అందులో బొప్పాయి గుజ్జుని కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. తరువాత దీనిని మీ ముఖ చర్మానికి రాసుకుంటే మొటిమలు చాలా ఈజీగా మాయమవడంతో పాటు చర్మం కూడా చాలా కాంతివంతంగా తయారవుతుంది.


ఇంకా అలాగే బొప్పాయి గుజ్జులో ఒక చెంచా పచ్చిపాలు, తేనె, పసుపు ఇంకా అలాగే తులసి ఆకుల రసం కలుపుకొని ముఖానికి పట్టిస్తే, మొటిమలు ఇంకా తెల్లమచ్చలు చాలా ఈజీగా తగ్గుతాయి.అలాగే బొప్పాయి గుజ్జుతో అర స్పూన్‌ అలోవెరా జ్యూస్ ఇంకా కొంచెం తేనె కలిపి చర్మానికి రాసుకుంటే దానికి కావలసిన తేమ అలాగే పోషక పదార్థాలు అంది చాలా యవ్వనంగా కనిపిస్తారు.ఇంకా అలాగే నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయను మీ సొంతం అయినట్లే. ఇంకా బొప్పాయి పండుకు ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది. అందుకు మీరు కోడిగుడ్డులోని తెల్లసొన కొంచెం తీసుకొని ఒకస్పూన్‌ బొప్పాయి గుజ్జుతో బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఒక అరగంట సేపు అలానే ఉంచుకొన్న  తర్వాత ముఖాన్ని చన్నీళ్ళతో కడిగేసుకోవాలి. అలా వారానికి రెండు సార్లు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: