చర్మం గ్లో అవ్వాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
చర్మం గ్లో అవ్వాలంటే ఇలా చెయ్యండి..నీరు మన శరీరం ఇంకా అలాగే చర్మాన్ని చాలా హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్‌ ఎలిమెంట్స్ బయటకు రావడం వల్ల చర్మంపై మెరుపు అనేది వస్తుంది. శరీరం అన్ని రోగాలకి కూడా దూరంగా ఉంటుంది. నీరు చర్మం లోపల నుంచి గ్లో తీసుకొస్తుంది.శనగలు, గోధుమలు ఇంకా సోయాబీన్ మొదలైన వాటిని మొలకెత్తిన తర్వాత రోజూ తినాలి. ఈ ఆహారాలు మీ శరీరంలోని ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు ఇంకా అలాగే మినరల్స్ వంటి అన్ని పోషకాల లోపాన్ని తొలగిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల చర్మం తాజాగా ఉంటుంది.వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్, సోయాబీన్, క్యాలీఫ్లవర్, సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్ ఇంకా అలాగే గుడ్లు మొదలైన వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. 


ముడతల సమస్యను తొలగించి చర్మాన్ని బాగా బిగుతుగా చేస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువ కాలం మీరు యవ్వనంగా ఉండొచ్చు.ఈ టమోటాలలో లైకోపీన్ అనేది ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన మంచి యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి కూడా మీ చర్మాన్ని కాపాడుతుంది. అలాగే టొమాటో రసాన్ని ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరంలోని అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఇంకా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.ప్రతి రోజూ కనీసం రెండు మూడు సార్లు టీకి బదులు గ్రీన్ టీ ఖచ్చితంగా తాగాలి. అయితే టీ, కాఫీలకు మాత్రం పూర్తిగా దూరంగా ఉండాలి. గ్రీన్ టీలో అస్సలు చక్కెర లేదా పాలు ఉపయోగించవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: