బట్టతల ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో అసలు చాలా మంది కూడా పాతికేళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్‌లను ధరించడం వంటి కారణాల వల్ల వెంట్రుకలు చాలా సులభంగా రాలిపోతున్నాయి. దీంతో చేసేది లేక వారు రకరకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. అయితే ఇంట్లో లభించే బీట్‌రూట్‌తో బట్టతలకు చాలా ఈజీగా ఇంకా శాశ్వతంగా చెక్‌ పెట్టవచ్చని మీకు తెలుసా.? బీట్‌రూట్‌తో తయారు చేసే హెయిర్‌ ప్యాక్‌గా వాడితే ఖచ్చితంగా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి.బీట్‌రూట్ రసం అర కప్పు ఇంకా అల్లం రసం రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఆలివ్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ఆ మూడింటిని తీసుకోవాలి. ఇక ఆ తరువాత బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ చేయడానికి మీరు ఒక పాత్ర తీసుకోవాలి.ఇక ఆ పాత్రలో అరకప్పు బీట్‌రూట్ రసం వేయాలి.


ఆ తర్వాత అందులో రెండు చెంచాల అల్లం రసం వేసి కలపాలి. ఇక ఆ తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ని కూడా వేయాలి. వీటన్నంటినీ కూడా మీరు బాగా కలపితే బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ అనేది రెడీ అవుతుంది.ఇక ఈ బీట్‌రూట్ హెయిర్‌ ప్యాక్‌ను వెంట్రుకలకు అప్లై చేసుకునే సమయంలో ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని జుట్టు ఇంకా అలాగే తలపై కొద్దిగా అప్లై చేసి బాగా నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఇలా ఒక 20 నిమిషాలపాటు చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బట్టతల సమస్య చాలా ఈజీగా దూరమవుతుంది. జుట్టు రాలడం అనేది ఆగిపోయి, మీ వెంట్రుకలు చాలా ఆరోగ్యంగా ఇంకా దృఢముగా మారుతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చూసి చూడండి. చాలా ఈజీగా బట్టతల సమస్య అనేది తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: