చుండ్రు సమస్య పూర్తిగా తగ్గాలంటే..?

Purushottham Vinay
చుండ్రు సమస్య పూర్తిగా తగ్గాలంటే నిమ్మరసంలో కొబ్బరి నూనెను కలిపి మీ తలకు బాగా పట్టించాలి. ఇక వెంట్రుకలను ఆవిరిలో ఉంచి దాదాపు రెండు గంటల పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో బాగా శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ టిప్స్ పాటించడం వల్ల చుండ్రు సమస్య నుండి చాలా ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు. ఇంకా అలాగే వీటిని పాటిస్తూనే మంచి నీటిని ఎక్కువగా తాగాలి.ఖచ్చితంగా కూడా మీరు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. బి విటమిన్స్ ఇంకా జింక్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు అది మన దరి చేరకుండా ఉంటుంది. ఇంకా అలాగే అంతేకాకుండా జుట్టు కూడా చాలా కాంతివంతంగా తయారవుతుంది.


మీ జుట్టులోని పొడిదనాన్ని ఇంకా అలాగే చుండ్రును తొలగించడంలో ఆలివ్ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నూనెను జుట్టుకు బాగా పట్టించి మర్దనా చేయాలి. తరువాత మీ జుట్టును టవల్ తో ముడివేయాలి.ఒక అరగంట శుభ్రం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అలాగే చుండ్రతో బాధపడే వారు కలబంద గుజ్జులో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు పట్టించి బాగా మర్దనా చేయాలి. ఇక ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఈ టిప్ ని పాటించడం వల్ల చుండ్రుతో పాటు దురద సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో వేసి రాత్రంతా కూడా బాగా నానబెట్టాలి. ఆ తరువాత ఉదయాన్నే వీటిని మెత్తని పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు బాగా పట్టించాలి. ఇక దాదాపు అరగంట పాటు తలను ఆరనిచ్చి ఆ తరువాత తలస్నానం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: