జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలను పోగొట్టే టిప్?

Purushottham Vinay
జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలను పోగొట్టే టిప్ ఒకటి వుంది.ఈ టిప్ ని తయారు చేయడానికి మనం కరివేపాకును ఇంకా గుంటగలగరాకు లేత ఆకులను, పుల్లటి పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా మనకు ఎక్కువగా సహజ సిద్దంగా లభించే పదార్థాలే. ఈ టిప్ కోసం మనం ఎండిన గుంటగలగరాకును కూడా ఉపయోగించవచ్చు.ఇందుకోసం ఫస్ట్ మీరు కరివేపాకు, గుంటగలగరాకును శుభ్రంగా కడగాలి. ఆ తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తరువాత దాలిలో పెరుగును వేసి మరలా మిక్సీ పట్టుకున్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఆ తరువాత జుట్టును శుభ్రంగా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తరువాత పాయలు తీసుకుంటూ జుట్టుకి ఈ మిశ్రమాన్ని పట్టించాలి.ఇంకా ఆ తరువాత కుదుళ్లకు పట్టేలా బాగా మర్దనా చేయాలి. ఒక గంట తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో లేదా హెర్బల్ షాంపుతో బాగా శుభ్రంగా తలస్నానం చేయాలి.


ఇలా వారానికి ఒకసారి ఈ టిప్ ని మీరు పాటించడం వల్ల ఖచ్చితంగా చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల మీ జుట్టు బాగా నల్లగా మారుతుంది.ఇంకా అలాగే మీ జుట్టు కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం తగ్గుతుంది. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి బయట చాలా ఎక్కువ ధరలకు లభించే రసాయనాలు కలిగిన షాంపులనూ వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీరు వాడడం వల్ల చాలా అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు.ఈ టిప్ మీ జుట్టుకు మంచి దివ్యౌషధంలా పని చేస్తుంది. ఈ టిప్ వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు చాలా బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. ఇంకా అలాగే తెల్ల జుట్టు నల్లబడుతుంది.మీ జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చే టిప్ ని ఖచ్చితంగా ట్రై చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: