డార్క్ సర్కిల్స్ ఈజీగా తగ్గే టిప్స్?

Purushottham Vinay
ఇక డార్క్ సర్కిల్స్ సమస్యతో ఎక్కువ మంది యువత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేట్ నైట్లో చాటింగ్స్ ఇంకా అలాగే వీడియోలు, మూవీలు చూస్తూ.. నిద్రను నిర్లక్ష్యం చేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల ఏర్పడే అలసట.. చర్మాన్ని నిస్తేజంగా మార్చుతుంది. దీంతో ముఖంపై డార్క్ సర్కిల్స్ఏర్పడతాయి. ఎక్కువగా డ్రింక్ చేసే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది.ఇక ఈ డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గడానికి ఏం చేయాల్లో తెలుసుకుందాం.ఉదయం లేదా సాయంత్రం.. సుమారు పది నిమిషాలు ఐస్క్యూబ్స్తో కళ్లను మసాజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా చర్మం మీద కాకుండా.. కాటన్ క్లాత్లో చుట్టి.. మెల్లిగా కళ్లను మసాజ్ చేయాలి. మీకు ఐ మాస్క్ ఉంటే.. మీరు దానిని కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి కళ్లకు పెట్టుకోవచ్చు.మీరు ఉపయోగించడానికి కోల్డ్ కంప్రెస్ లేదా మాస్క్ లేకుంటే.. ఉపయోగించిన టీ బ్యాగ్‌లు మీకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. గ్రీన్ టీ వంటి అనేక టీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి అదనపు ప్రయోజనాన్ని అందిస్తాయి. ఇవి మీ కళ్లకింద ఉండే క్యారీబ్యాగ్స్ను, డార్క్ సర్కిళ్లను తగ్గిస్తాయి.కీరదోసకాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులోని అధిక నీటి కంటెంట్ కంటి కింద వాపు, నల్లటి వలయాలను తగ్గిస్తుంది.


తాజా కీరదోసకాయను మందపాటి ముక్కలుగా కోసి.. ఆపై 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. ఈ దోసకాయ ముక్కలను మీ కళ్లపై ఉంచి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమాన్ని కాలక్రమేణా ఉపయోగిస్తే నల్లటి వలయాలకు సహజ నివారణ కావచ్చు. పడుకునే ముందు మీ డార్క్ సర్కిల్స్ను బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమంతో కలిపి మసాజ్ చేయండి. ఉదయం లేచిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.పాల ఉత్పత్తులు విటమిన్-ఎను కలిగి ఉంటాయి. ఇందులో రెటినోయిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచడంలో గొప్పగా పనిచేస్తాయి. చల్లని పాల గిన్నెలో కాటన్ మేకప్ రిమూవర్ ప్యాడ్‌ను నానబెట్టండి. అనంతరం 10 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే.. డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుతుంది.నిద్రపోవాలి.నిర్ణీత సమయం పడుకోకపోవడం వల్ల కళ్ల కింద ద్రవం పేరుకుపోతుంది. కాబట్టి నిద్ర దినచర్యను మార్చుకోవాల్సి రావచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎక్కువ నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ సహజ నివారణలతో డార్క్ సర్కిళ్ల సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. కాబట్టి తప్పకుండా పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: