వేసవి కాలంలో చుండ్రు, జుట్టురాలే సమస్యలకు ఇలా చెక్ పెట్టొచ్చు!

Purushottham Vinay
ఈ వేసవి కాలంలో జుట్టు రాలే సమస్య ఇంకా చుండ్రు తగ్గడం కోసం మీకు రెండు టేబుల్ స్పూన్ల కుంకుడుకాయల పొడి, రెండు టేబుల్ స్పూన్ల షికాకాయ్ పొడి, రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, కరివేపాకు రసం, నిమ్మకాయ రసం అనేవి అవసరం. ఈ పదార్థాలన్నింటినీ కూడా మిక్స్ చేసి హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి. దీన్ని జట్టుకు పట్టించి ఒక 40 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రంగా స్నానం చేసుకోవాలి. ఇది చుండ్రును తొలగించడంలో చాలా ఈజీగా సహాయపడుతుంది. శికాకాయ్‌లో జుట్టును శుభ్రపరిచే గుణాలు ఎంతో పుష్కలంగా ఉన్నాయి. షికాకాయ్ పౌడర్‌లో విటమిన్ ఎ, కె, సి, డి అనేవి ఉన్నాయి. ఇది జుట్టును బాగా ఆరోగ్యంగా ఉంచుతుంది.అలాగే రోజ్ వాటర్‌తో మీ తలకు బాగా మసాజ్ చేయండి. పొడి జుట్టుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


చిట్లిన జుట్టు కోసం మీకు 1 అరటిపండు, 4 టేబుల్ స్పూన్ల పెరుగు ఇంకా అలాగే 1-2 టేబుల్ స్పూన్ల తేనె అనేది అవసరం. అరటిపండును బాగా మెత్తగా చేసి అందులో పెరుగు ఇంకా అలాగే తేనెను కలపండి. ఇక దానిని బాగా మెత్తగా చేసి.. జట్టు చివరి వరకు బాగా పట్టించాలి. ఆ తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో బాగా శుభ్రం చేసుకోవాలి.మెరిసే, మృదువైన జుట్టు కోసం 4 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ఇంకా అలాగే 4 టేబుల్ స్పూన్ల తేనె అవసరం. ఆలివ్ ఆయిల్ ఇంకా తేనె కలిపి పొడి జుట్టుకు పట్టించి బాగా మసాజ్ చేయండి. ఇక ఆ తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో శుభ్రంగా స్నానం చేసుకోవాలి.అలాగే పొడి జుట్టు కోసం మీకు 2 టేబుల్ స్పూన్ల అవకాడో రసం, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె ఇంకా అలాగే 2 టేబుల్ స్పూన్ల తేనె అవసరం.ఇక ఈ పదార్థాలన్నింటినీ కూడా బాగా కలిపి మీ జట్టుకు బాగా పట్టించి కాసేపు మసాజ్ చేయాలి. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత షాంపూతో బాగా శుభ్రంగా స్నానం చేసుకోండి.ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా ఇలా చేస్తే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: