జుట్టు పొడిగా ఉంటే ఇలా చెయ్యండి..

Purushottham Vinay
పెరుగులో కాల్షియం ఇంకా ప్రొటీన్లు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేగాక వీటిలో విటమిన్ ఎ, పొటాషియంఇంకా మెగ్నీషియం కూడా ఎంతో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. అలాగే పాలు ఇంకా పెరుగు రెండూ జుట్టు రాలడాన్ని త్వరగా తగ్గిస్తాయి. అంతేగాక జుట్టును తేమగా ఇంకా ఎంతో మృదువుగా కూడా ఉంచుతాయి. ముఖ్యంగా పెరుగులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇంకా అలాగే యాంటీ మైక్రోబియల్ గుణాలు అనేవి ఉన్నాయి, ఇది తలపై చుండ్రును వదిలించుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇక అవోకాడోలో బహుళఅసంతృప్త ఇంకా అలాగే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అనేవి ఉంటాయి. ఇవి మొత్తం శారీరక ఆరోగ్యానికే కాకుండా పొడి జుట్టుకు చికిత్స చేయడానికి కూడా చాలా మంచివి. ఈ అవకాడో అన్ని రకాల జుట్టుకు ఎంతగానో మేలు చేస్తుంది. అవకాడో పండులో కండకలిగిన భాగాన్ని బాగా మెత్తగా రుబ్బుకుని తలకు రాసుకుని తలస్నానం కనుక చేస్తే జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

ఇక అరటిపండులో సహజ నూనెలతో పాటు కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఇంకా పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు వెంట్రుకల కుదుళ్లను చాలా మృదువుగా చేస్తాయి. ఇంకా అలాగే జుట్టు యొక్క స్థితిస్థాపకతను కూడా రక్షిస్తాయి. ఇవి జుట్టు చిట్లడం ఇంకా అలాగే జుట్టు చిట్లకుండా ఇంకా చుండ్రును కూడా నియంత్రిస్తాయి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఇంకా ఒత్తుగా కూడా మారుతుంది. కాబట్టి బనానా హెయిర్ మాస్క్ ని తరచుగా వేసుకోవడం చాలా మంచిది. అలాగే బాగా పండిన అరటిపండును బాగా మెత్తగా చేసి ఇక అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి తరువాత తడి జుట్టుకు అప్లై చేసి, షవర్ క్యాప్ పెట్టుకుని, ఇక అలాగే ఒక 20 నిమిషాలు పాటు నానబెట్టి, ఆ తర్వాత తేలికపాటి షాంపూని ఉపయోగించి చల్లటి నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: