చర్మ సంరక్షణకు అద్భుతమైన చిట్కాలు...

Purushottham Vinay
చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. చర్మానికి రక్షణ లేకపోతే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించండి.ముందుగా బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా.. కొంచెం సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి.నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉంటారు. దీనివల్ల చర్మం ఫ్రెష్‌గా, అందంగా కనిపిస్తుంది.స్వచ్ఛమైన కొన్ని పాలు తీసుకొని ఆ పాలలో రెండు కుంకుమ పూరేకలను వేసి కలపాలి. ఇలా చేసిన పదార్థాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.కొద్దిసేపైన తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది. అలాగే అవకాడో పండు, అరటి పండును ముక్కలు ముక్కలుగా కోసి మెత్తగా పేస్టు చేయాలి. ఇందులో తేనె వేసి కలపాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి 45 నిమిషాల తర్వాత తీసివేస్తే చర్మం సూర్యునిలా ప్రకాశించడం ఖాయం.రెండు చెంచాల కొబ్బరిపాలలో కొన్ని అరటి పండు ముక్కలు వేసి పేస్టుగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా పూయాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

అలాగే శనగపిండి చర్మానికి చాలా మంచిది. ఇది చర్మ సంరక్షణలో చాలా ఉపయోగపడుతుంది. వానా కాలంలో జిడ్డు చర్మం ఉన్నవారికి హైడ్రేట్‌గా పనిచేస్తుంది. శనగపిండిలో పాలు లేదా పెరుగు కలిపి చర్మానికి రాస్తే చర్మంలో తేమ పెరుగుతుంది.బియ్యం పిండిలో చర్మాన్ని బిగించే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఫేస్ మాస్కులలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పొడి చర్మం ఉన్నవారు అసలు బియ్యంపిండి వాడకూడదు. ఎందుకంటే బియ్యం పిండి చర్మంలో తేమను తగ్గిస్తుంది. దాంతో ముడతలు వస్తాయి.కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయస్కరం.బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్లను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇక బూట్లు, సాక్సులు ధరించకపోవడం మంచింది. వాటితో ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం పుష్కలంగా వుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. చర్మాన్ని సంరక్షించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: