చర్మ రంధ్రాలను శుభ్రపరిచి, యవ్వనంగా కనిపించే చిట్కా ఏంటో తెలుసా..!

Divya

చర్మంలోని రంధ్రాలను సహజసిద్ధంగా శుభ్రపరిచి, యవ్వనంగా కనిపించాలంటే మాత్రం కొన్ని చిట్కాలను తప్పనిసరిగా ఆచితూచి పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు కొద్దిగా ఖరీదైనవి అయినప్పటికీ, ఎంతో తాజాగా సహజసిద్ధంగా చర్మాన్ని యవ్వనంగా కాంతులీనే లాగా చేసుకోవచ్చు. మీరు మార్కెట్లో ఏవో కెమికల్ పదార్థాలకు పెట్టే డబ్బులో సగం మాత్రమే వీటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
 ఓట్మీల్  :
ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తో అరకప్పు వండిన ఓట్మెల్ ను తీసుకొని చర్మంపై అప్లై చేసి పది నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత ఇవన్నీ చేతి మునివేళ్లతో తుడిచివేసి చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఓట్మీల్ రంధ్రాలకు సున్నితమైన స్క్రబ్ గా పనిచేస్తుంది.  అలాగే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
గుడ్డు,తేనె :
పొడి చర్మంతో బాధపడేవారు ఒక గుడ్డులోని పచ్చసొనను తీసుకొని, అందుకు ఒక టేబుల్ స్పూన్ తేనె,ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేసి,ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాలు ఆరబెట్టాలి. ఇది మీ పొడి చర్మానికి ఎటువంటి నష్టం లేకుండా మీ చర్మ రంధ్రాలను  శుభ్రపరుస్తుంది.
అవకాడో :
సగం అవకాడో తీసుకుని, పేస్టులాగా చేసి ముఖం మీద అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత అవకాడోను తడి గుడ్డతో తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా,  మృదువుగా మారుతుంది.
ముల్తానీ మట్టి :
ముల్తాని  మట్టిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని, అందులో కొద్దిగా రోజ్ వాటర్,1 టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో అద్దిన టవల్ తో తుడిచి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సహజంగా చర్మం కాంతిని పుంజుకుంటుంది.
వంట సోడా :
వంటసోడా లో నీటిని కలిపి,తేలికపాటి ప్రక్షాళన చేసి, ముఖం మీద అప్లై చేసి,స్క్రబ్ లాగ ఉపయోగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: