గుడ్డుతో ఎంత అందమో! మీకు తెలుసా?

Durga Writes

గుడ్డు.. ఎన్నో పోషకాలు అందించే ఈ గుడ్డులో ఎన్నో ప్రోటీన్లు.. ఎన్నో విటమిన్లు ఉంటాయి. మరి అలాంటి విటమిన్లను, ప్రోటీన్లను ఉండే గుడ్డు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో సాయం చేస్తుంది. గుడ్డు అందానికి ఏలా సాయం చేస్తుంది? ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

చర్మ సౌందర్యానికి ఈ చిట్కాలు పాటించండి... 

 

గుడ్డులోని లూటిన్ అనే పదార్ధం చర్మానికి తగినంత తేమ అందిస్తుంది. 

 

తరచూ గుడ్డులోని తెల్లసొనను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత నీటితో కడిగితే మృత కణాలు తొలిగిపోతాయి. మొటిమలు కూడా తగ్గుతాయి. కంటికింది వలయాలు కూడా తగ్గుతాయి. 

 

జిడ్డు చర్మం ఉన్నవారు గుడ్డుతెల్లసొన, చెంచా కొబ్బరి నూనె కలిపి వారానికి మూడు సార్లు ముఖం, మెడ భాగాలకు బాగా పట్టించి గోరు వెచ్చని నీటితో కడిగేస్తే క్రమంగా జిడ్డు తొలిగిపోయి కాంతివంతంగా తయారవుతుంది. 

 

ఇంకా పొడి చర్మనికి గుడ్డులోని పచ్చసొనలో అరచెంచా నిమ్మరసం, చెంచా తాజా ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే చర్మం తగినంత తేమను పొంది మృదువుగా తయారవుతుంది.

 

గుడ్డు సొనలో చెంచా తేనె, అరచెంచా ఆలివ్ ఆయిల్, 2 చెంచాల రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం మీద మొటిమల మచ్చలు, ఎండకు కమిలిన చర్మం ఉంటే 

 

ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగితే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ఇలా చేస్తే మచ్చలూ మాయం అవుతాయి.

 

ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ఈ చిట్కాలు పాటించండి.. 

 

గుడ్డుసొనలో చెంచా పెరుగు, చెంచా ఆలివ్ ఆయిల్, బాదం నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ మొదలు చివరల వరకూ బాగా పట్టించి గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టుకు బలం వస్తుంది. 

 

జుట్టు పెరుగుదల కోసం గుడ్డు సొనలో చెంచా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ జుట్టును అందంగా, కాంతి వంతంగా మార్చుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: