ఓలా,ఏథర్‌లకు పోటీనిచ్చే సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే?

Purushottham Vinay
కర్ణాటకలోని బెలగావి కేంద్రంగా ఉన్న స్టార్ట్‌ అప్ కంపెనీ రివో తాజాగా ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తుంది.280 కిలోమీటర్ల పరిధితో వచ్చే రివోట్‌ ఎన్‌ఎక్స్‌ 100 పేరుతో కొత్త ఈవీ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.రివోట్‌ ఎన్‌ఎక్స్‌ 100 స్కూటర్ మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యం అవుతుంది. బేస్ వేరియంట్ వచ్చేసి 1,920 డబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. బేస్‌ మోడల్‌ 100 కిలోమీటర్ల మైలేజ్‌ వచ్చేలా డిజైన్ చేశారు.ఇతర వేరియంట్‌లు 3,840డబ్ల్యూహెచ్‌, 5,760 డబ్ల్యూహెచ్‌ అనే వెర్షన్స్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్‌లతో చాలా బాగా ఉంటాయి. ఈ స్కూటర్లు 200 కిలో మీటర్లు ఇంకా 280 కిలోమీటర్ల పరిధితో వస్తాయి. అయితే ఈ శ్రేణి ఇంకా పరీక్షించలేదని మార్కెట్‌ నిపుణులు తెలుపుతున్నారు. ఎన్‌ఎక్స్‌ 100 ఈవీ మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని స్కూటర్ల కంటే కూడా అప్‌గ్రేడబుల్ శ్రేణితో ఉంటుంది.


ఇందులో ఎవరైనా తక్కువ వేరియంట్‌ని వాడే వారు అధిక వేరియంట్ స్కూటర్‌ను ఎంచుకోకుండా బ్యాటరీ ప్యాక్‌ను అప్‌గ్రేడ్ చేయవచ్చు.ఇంకా ఈ స్కూటర్‌లు స్కూటర్‌లోనే నిక్షిప్తమయ్యే ఛార్జింగ్ కేబుల్స్‌తో వస్తాయి.ఇంకా అలాగే ఈ స్కూటర్‌లు సహాయక పవర్ యూనిట్‌ను కూడా పొందుతాయి ఇది ఆన్‌బోర్డ్‌లోని బ్యాటరీలలో చార్జింగ్‌ అయిపోతే, అత్యవసర పరిస్థితుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ రివోట్‌ ఎన్‌ఎక్స్‌ 100ను రూ. 499 టోకెన్ మొత్తానికి స్కూటర్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. స్కూటర్ డెలివరీలు 2024 మధ్య నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. బేస్ వేరియంట్ ధర రూ. 89,000 మధ్య ఉండవచ్చు. టాప్ స్పెక్ వేరియంట్ కోసం రూ. 1.59 లక్షల ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే ఈ కంపెనీ భారతదేశంలోని మొత్తం 30 నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది. ప్రారంభ సంవత్సరంలో 10,000 స్కూటర్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: