ఫేమస్ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ ప్యూర్ EV ఏకంగా 201 KM రేంజ్ లో ePluto 7G Max పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రివర్స్ గేర్ టెక్నాలజీ తో ఈ స్కూటర్ ను కంపెనీ లాంచ్ చేసింది. మంచి ఫీచర్లతో కంపెనీ ఈ సూపర్ స్కూటీని లాంచ్ చేసింది. ప్యూర్ EV- E ప్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేయటం వలన రైడర్స్ కి స్పెషల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో స్పెషల్ ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది ప్యూర్ EV కంపెనీ.
ఈ స్కూటర్ మైలేజ్ విషయానికి వస్తే.. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా డిజైన్ చేయబడ్డ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 201 కిలోమీటర్ల నాన్ స్టాప్ మైలేజ్ వస్తుంది.ఈ స్కూటర్ ని హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ తో డిజైన్ చేశారు. లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ AI వంటి సూపర్ ఫీచర్స్ ఉండటం ఈ స్కూటర్కి మరో స్పెషాల్టీ. ఇక ఈ స్కూటర్ కి కనెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌లో 3.5 kWh లిథియం- అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఫిక్స్ చెయ్యడం వలన ఈ స్కూటర్ 3.21 bhp మేర అత్యధిక శక్తినందిస్తుంది. ఈ AIS-156-సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన స్మార్ట్ బ్యాటరీ పవర్ అనేది చాలా కీలకం. ఇన్ని ఫీచర్లతో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ రోడ్లపై రైడర్స్ కి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయమని కంపెనీ నిర్వాహకులు ధీమా వ్యక్తం చేసారు.
మొత్తం నాలుగు కలర్ లలో ప్యూర్ EV- ePluto 7G Max లాంచ్ కానుంది. మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ కలర్ లలో మార్కెట్లోకి కంపెనీ విడుదల చేస్తోంది.
ఇక ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే ఎక్స్- షోరూమ్ ధర కేవలం రూ. 1,14,999 గా ఉంది. దేశవ్యాప్తంగా ఈ స్కూటర్ బుకింగ్స్ ని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా.. ప్లూటో సెవెన్ జీ మ్యాక్స్ బుక్ చేసుకున్న వారికి పండుగ సందర్భంగా కంపెనీనే డెలివరీ చేస్తోంది. రైడర్స్ కి మంచి అనుభూతి అందించటానికి ఇందులో మొత్తం మూడు రైడింగ్ మోడ్‌లు ఫిక్స్ చేశారు. ఇంకా దీంతో పాటు, ఈ EV స్కూటర్ 60 వేల కిలోమీటర్ల వారంట్ తో వస్తోంది. 70 వేల కిలోమీటర్ల వారంటీ కూడా ఈ సూపర్ స్కూటర్కి ఉంది.