Run R HS+ : మార్కెట్లో గట్టి పోటీకి రెడీ?

Purushottham Vinay
ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో కొత్త కంపెనీ రెడీ అయ్యింది. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో బజాజ్ చేతక్‌కు పోటీనిస్తూ గుజరాత్‌లోని రన్ఆర్ మొబిలిటీ కంపెనీ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయడం స్టార్ట్ చేసింది.ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో తన ప్లేస్ ని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ ఇండియన్ టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కంపెనీ ఫస్ట్ బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేస్తన్నట్లు టీజర్‌ను విడుదల చేసింది. ఇక రన్ఆర్ హెచ్ఎస్, రన్ఆర్ హెచ్ఎస్ ప్లస్ వేరియంట్లల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.ఇంకా ఈ స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీతో వస్తుందని ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే మొత్తం 4.2 ఎకరాల్లో విస్తరించి ఉన్న రన్ఆర్ మొబిలిటీ టాప్-నాచ్ ప్లాంట్‌లో ఈ స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభమైంది.


ప్రతిరోజూ కూడా మొత్తం 500 టూ వీలర్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పుడు ఈ రెండు స్కూటర్ల ఫీచర్లను ఓ సారి తెలుసుకుందాం.కేవలం మైలేజ్ పైనే ఫోకస్ పెట్టి ఈ సూపర్ స్కూటర్లను డిజైన్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఈ రన్ఆర్ హెచ్ మోడల్ ఓ సారి చార్జి చేస్తే ఏకంగా 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. రన్ఆర్ హెచ్ ప్లస్ మోడల్ అయితే 140 కిలో మీటర్ల రేంజ్ తో వస్తుంది. బ్యాటరీ, బీఎంఎస్ రెండూ కూడా సీఎన్ ఆధారంగా పని చేస్తాయి.కంపెనీ రియల్ టైమ్ బ్యాటరీ మానిటరింగ్ టెక్నాలజీ ఇంకా అలాగే బ్యాటరీ మార్పిడిని కూడా దాని అత్యుత్తమ ఫీచర్లుగా పేర్కొంటుంది. ఎంబీఓలు, ఫ్లీట్ యజమానులు, ఇతరులతో పాటు, స్మార్ట్ హై-స్పీడ్ మోడల్ హెచ్ఎస్ ఇంకా అలాగే హెచ్ఎస్ ప్లస్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అధిక-కాంట్రాస్ట్ కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి ఎక్సట్రా ఫీచర్లతో వస్తుంది. ఈ రెండు స్కూటర్లు కూడా సరమైన ధరల్లో వస్తున్నాయి.అయితే కంపెనీ తెలిపినా ధర మాత్రం ఏ రేంజ్‌లో ఉంటుందని మాత్రం పేర్కొనలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: