ఇక ఇండియన్ మార్కెట్లో cng వాహనాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా మారుతి సుజుకి కంపెనీ తమ వాహనాలను cng వాహనాలుగా మారుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు టయోటా కంపెనీ కూడా cng వాహనాలను ప్రవేశపెట్టడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది.అందువల్ల టయోటా హైరైడర్ cng కార్ ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ కార్ కోసం రూ. 25,000 చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు.త్వరలో రిలీజ్ కానున్న ఈ హైరైడర్ cng మిడ్ సైజ్ SUV కార్ విభాగంలో మొదటి cng బేస్డ్ మోడల్ అవుతుంది. ఇది S ఇంకా G అనే రెండు ట్రిమ్స్ లో అందుబాటులోకి రానుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5లీ NA పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇంకా అలాగే cng వెర్షన్‌తో కూడిన 1.5-లీటర్ పెట్రోల్‌తో సహా 3 పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందించబడే సెగ్మెంట్‌లోని మొదటి మోడల్ కార్ ఇదే అవుతుంది.హైరైడర్ cng వెర్షన్ లో 1.5 లీటర్ K15C ఇంకా 4-సిలిండర్ ఇంజన్‌తో అందించబడే అవకాశం ఉంటుంది. ఇది 5,500rpm వద్ద 87bhp పవర్ ఇంకా అలాగే 4,200rpm వద్ద 121.5Nm టార్క్ ని అందిస్తుంది.
ఇంకా అలాగే ఇది పెట్రోల్ మీద నడిచేటప్పుడు 6,000rpm వద్ద 99 bhp పవర్ ఇంకా 4,400rpm వద్ద 136Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.ఇక ఈ కార్ మైలేజ్ విషయానికి వస్తే, ఇది మొత్తం 26.10కిమీ/కేజీ అందిస్తుంది. మొత్తం మీద ఇది దాని పెట్రోల్ మోడల్ కంటే కూడా చాలా మంచి మైలేజ్ అందిస్తుంది. ఈ కారులో అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఆపిల్ కార్ ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కూడా ఇందులో ఉంటుంది. ఇంకా అంతే కాకుండా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఇంకా పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి.ఇక ఈ కారులో సన్నని డబుల్-లేయర్ డేటైమ్ రన్నింగ్ లైట్లు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి 'క్రిస్టల్ యాక్రిలిక్' గ్రిల్‌లో చాలా చక్కగా కలిసిపోతాయి.ఇంకా అలాగే వెనుక వైపు సి-ఆకారంలో ఉండే టెయిల్ లైట్స్ కూడా ఉన్నాయి.