ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఖాతాలో గ్రేట్ రికార్డ్?

Purushottham Vinay
ఫోక్స్‌వ్యాగన్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగన్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలైంది. కంపెనీ ఈ SUV ని ఇండియన్ మార్కెట్లో విడుదలచేసినప్పటి నుంచి కూడా మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతోంది.కాగా కంపెనీ ఇప్పటికి ఈ కారు కోసం ఏకంగా 45,000 కంటే ఎక్కువ యూనిట్ల కోసం బుకింగ్స్ స్వీకరించగలిగింది. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.2021 సెప్టెంబర్ నుంచి 28,000 యూనిట్ల టైగన్ SUV లను డెలివరీ చేసింది. ఈ SUV మంచి డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది కొనడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. ఇది కుర్కుమా ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ ఇంకా అలాగే కార్బన్ స్టీల్ గ్రే అనే 5 కలర్ ఆప్షన్స్ లో అందిస్తుంది.ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ ఇంకా 1.5 లీటర్ TSI ఇంజిన్‌ పొందుతుంది.



ఇందులోని 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ 113 బిహెచ్‌పి పవర్ ఇంకా 178 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ఇంకా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ తో యాడ్ చేయబడి ఉంటుంది. ఇది 148 బిహెచ్‌పి పవర్ ఇంకా 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ఇంకా 7-స్పీడ్ DSG తో జతచేయబడి ఉంటుంది.ఇది 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్ ఒక ఎల్ఈడీ బార్‌తో ఒక ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇందులో షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైస్, డ్యూయల్ టోన్ ORVM వంటివి కూడా ఉన్నాయి.ఇది MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ SUV ముందుభాగంలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: