ఇండియన్ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'టాటా పంచ్' ఎట్టకేలకు 'క్యామో ఎడిషన్'లో విడుదలైంది.ఈ కొత్త ఎడిషన్ ధరలు రూ. 6.85 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.టాటా పంచ్ కామో ఎడిషన్ కజిరంగా ఎడిషన్ తర్వాత విడుదలైన టాటా పంచ్ రెండవ స్పెషల్ మోడల్. నిజానికి క్యామో ఎడిషన్ అనేది 2020 నవంబర్ లో టాటా మోటార్స్ హారియర్‌తో ప్రారంభమైంది. ఆ తరువాత ఇతర మోడల్స్ కూడా ఈ క్యామో ఎడిషన్ లో విడుదల కావడం ప్రారంభమయ్యాయి.అయితే ఇప్పుడు టాటా పంచ్ కూడా క్యామో ఎడిషన్ లో విడుదలైపోయింది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్ లో ఎక్స్టీరియర్ ఇంకా ఇంటీరియర్ ఫీచర్స్ లో కొన్ని అప్డేట్స్ గుర్తించవచ్చు. అయితే ఇంజిన్ లో ఎటువంటి మార్పలు జరగలేదు, కావున అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాటా పంచ్ క్యామో ఎడిషన్ పర్ఫామెన్స్ స్టాండర్డ్ మోడల్ లాగానే ఉంటుంది.
ఇది కొత్త 'ఫోలేజ్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్' లో కనిపిస్తుంది. అయితే రూప్ మాత్రం పియానో బ్లాక్ లేదా ప్రిస్టైన్ వైట్ కలర్ లో ఉంది. మొత్తం మీద ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా డ్యూయెల్ కలర్ లో ఉంటుంది.గ్రిల్‌కి కింది భాగంలో క్రోమ్ ట్రిమ్ బ్లాక్ అవుట్ చేయబడి ఉంది. అంతే కాకూండా ఫ్రంట్ బంపర్‌లో కొత్త సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ పూర్తిగా బ్లాక్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. స్టాండర్డ్ మోడల్ లో డ్యూయల్-టోన్ వీల్స్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్‌లపైన క్యామో బ్యాడ్జింగ్ కూడా చూడవచ్చు. మొత్తం మీద డిజైన్ మునుపటికంటే కూడా మరింత ఆకర్షణీయంగా ఉంది.ఇందులోని సీట్లు మిలిటరీ గ్రీన్ షేడ్‌ను పొందుతాయి. అదే సమయంలో ఇందులో 7 ఇంచెస్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హర్మాన్ ఆడియో సిస్టం కూడా ఉన్నాయి. ఇందులోని 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. కూల్డ్ గ్లోవ్ బాక్స్, లెదర్ స్టీరింగ్ ఇంకా గేర్ నాబ్ వంటివి అలాగే ఉన్నాయి.