ఇండియన్ మార్కెట్లో 'టొయోట' కంపెనీ తన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యువి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' ని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో కొత్త హైరైడర్ ప్రారంభ ధరలు రూ. 15.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, టాప్ వేరియంట్ ధర రూ 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది.ఈ SUV కొనాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లింది టయోటా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త టొయోట హైరైడర్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.ఇందులో సన్నని డబుల్-లేయర్ డేటైమ్ రన్నింగ్ లైట్లు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి 'క్రిస్టల్ యాక్రిలిక్' గ్రిల్‌లో చక్కగా కలిసిపోతాయి. డోర్స్ మీద హైబ్రిడ్ బ్యాడ్జ్ వంటి వాటిని చూడవచ్చు. వెనుక వైపు సి-ఆకారంలో ఉండే టెయిల్ లైట్స్ ఉన్నాయి.ఇండియన్ మార్కెట్లో టొయోట హైరైడర్ మొత్తం 11 కలర్ ఆప్సన్స్ లో విడుదలైంది. ఇందులో 7 మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన నాలుగు డ్యూయెల్ టోన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కంపెనీ ఇప్పుడు ఏకంగా 11 కలర్ ఆప్సన్స్ లో తీసుకురావడం వల్ల కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్సన్స్ ఎంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఇప్పుడు పరిమాణం పరంగా కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున దీని పొడవు 4365 మిమీ, వెడల్పు 1795 మిమీ, ఎత్తు 1645 మిమీ కాగా, వీల్ బేస్ 2600 మిమీ వరకు ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో ఇంకా యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో 7-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది. అంతే కాకుండా ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, రిమోట్ ఇగ్నిషన్ ఆన్/ఆఫ్, రిమోట్ ఏసీ కంట్రోల్, డోర్ లాక్/అన్‌లాక్, స్టోలెన్ వెహికల్ ట్రాకర్ ఇంకా ఇమ్మొబిలైజర్ వంటి అనేక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.