ఇక దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో తన 'స్కార్పియో క్లాసిక్' ని లాంఛ్ చేసింది.కంపెనీ ఈ SUV కార్ ని రెండు వేరియంట్స్ లో తీసుకువచ్చింది. అవి ఎస్ ఇంకా ఎస్11 వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఇంకా రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).నిజానికి భారతీయ మార్కెట్లో ఆగష్టు 14 వ తేదీన మహీంద్రా కొత్త స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించబడింది. ఆ సమయంలో కంపెనీ దీని డిజైన్, ఫీచర్స్ ఇంకా అలాగే ఇంజిన్ డీటైల్స్ వెల్లడించింది. అయితే ఇక,నిన్న ధరలను వెల్లడించింది.మహీంద్రా కంపెనీ ఈ కొత్త SUV ని దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా హుందాగా తాయారు చేసింది. కావున ఈ కార్ చూడగానే కస్టమర్లను ఆకర్శించే విధంగా ఉంది. ఇది ఇప్పుడు 'పెర్ల్ వైట్, నాపోలి బ్లాక్, రెడ్ రేజ్, డి'సాట్ సిల్వర్ ఇంకా గెలాక్సీ గ్రే' అనే ఐదు కలర్స్ లో అందుబాటులో ఉంది. కావున కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.ఈ కొత్త స్కార్పియో క్లాసిక్ డిజైన్ విషయానికి వస్తే ఇది దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అప్డేటెడ్ మార్పులు కూడా మనం గమనించవచ్చు.
ఇందులో కొత్త లోగో, రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ఇంకా ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ అలాగే అప్డేట్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, ఇరువైపులా డ్యూయల్-టోన్ క్లాడింగ్ ఇంకా రీడిజైన్ చేయబడిన టెయిల్-ల్యాంప్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.ఇక పరిమాణం పరంగా కూడా కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ దాని ప్రీవియస్ మోడల్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కావున ఇది 4,456 మిమీ పొడవు, 1,820 మిమీ వెడల్పు, 1,995 మిమీ ఎత్తు ఇంకా వీల్‌బేస్ 2,680 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులుకు విశాలమైన క్యాబిన్ కూడా లభిస్తుంది.ఇంకా ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి కూడా సఫోర్ట్ చేస్తుంది.ఇంటీరియర్ 'బ్లాక్ అండ్ బేజ్' కలర్ థీమ్ కూడా పొందుతుంది. స్టీరింగ్ వీల్ లెథెరెట్ ఫినిషింగ్ కూడా పొందుతుంది, కావున ఇది మంచి పట్టును అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ ఇంకా సెంటర్ కన్సోల్ ఇప్పుడు వుడ్ ఇన్సర్ట్లను పొందుతాయి.