వేసవిలో కార్ రిపేర్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Purushottham Vinay
వేసవిలో అతిపెద్ద సమస్య ఏంటంటే కారు క్యాబిన్‌ను చల్లగా ఉంచడం. దీన్ని నివారించడానికి మీరు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే మీరు ఖచ్చితంగా కారును నీడలో పార్క్ చేయాలి. ఇక అలాంటి స్థలం లేకపోతే దానిపై ఎదైనా పదునైన కవర్‌ కప్పి ఉండేలా చూసుకోవాలి.అలాగే కారులో ఏసీ ఉంటుంది. ఇంట్లో అమర్చిన సాధారణ ఏసీలాగే, మీ కారు ఏసీకి కూడా సరైన సర్వీస్ అనేది అవసరం. మీ AC కంప్రెసర్‌లో టాప్ అప్ ఆయిల్ ఉందో లేదో చెక్ చేయడం ముఖ్యం. ఇది కాకుండా, ఏసీ ఫిల్టర్‌ను కూడా మీరు సమయానికి మార్చాలి. వేసవి ప్రారంభానికి ముందు కారు యజమానులు ఖచ్చితంగా ఏసీని చెక్ చేయించుకోవాలి.అలాగే వేసవిలో గరిష్ట ఒత్తిడి కారు టైర్లపై ఉంటుంది. వేసవిలో టైర్ల పరిమాణం బాగా పెరుగుతుంది. టైర్‌లో గాలి పీడనం ఎక్కువగా ఉంటే, అది పగిలిపోయే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే డ్రైవింగ్ చేసే ముందు టైర్ ప్రెజర్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. టైర్లలో సరైన ప్రమాణం ఉన్నంత గాలిని మాత్రమే నింపండి. గాలిని అనవసరంగా నింపడం వల్ల ప్రమాదాల జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.


ఇక వేసవి నెలల్లో కారును చల్లగా ఉంచడానికి కూలెంట్ అవసరం కూడా చాలా పెరుగుతుంది. అందుకే నాణ్యమైన కూలెంట్ అనేది కారుకు ఎల్లప్పుడూ మంచిది. వాహనాలు పాతవిగా మారిన తర్వాత కూలెంట్‌ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.ఇక అధిక వేడి కారు బ్యాటరీపై కూడా ప్రభావం అనేది చూపుతుంది. ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వేసవి కారణంగా, బ్యాటరీ లోపల రసాయన ప్రతిచర్యలు అనేవి సంభవిస్తాయి. అధిక ఛార్జింగ్ ప్రమాదం కూడా పెరుగుతుంది. వేసవిలో మీ కారు ఎక్కువగా నడుస్తుంటే కారు బ్యాటరీని చెక్ చేస్తూ ఉండండి. దీనితో పాటు, బ్యాటరీ టెర్మినల్‌ను కూడా చెక్ చేయండి. అలాగే వేడి నుండి రక్షించడానికి మీ కారును ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచండి. ఈ సమయంలో కారును కడగడం అనేది చాలా ముఖ్యం. కార్ వాష్ చేయడం వల్ల దుమ్ము ఇంకా ధూళీ తొలగిపోతుంది. ఇది కారు కండీషన్‌గా ఉంచేందుకు చాలా ఉపయోగపడుతుంది. కారును కడగడానికి ఎల్లప్పుడూ కూడా కార్ వాషింగ్ షాంపూని ఉపయోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: