మార్చిలో ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రికార్డ్ బుకింగ్స్!

Purushottham Vinay
బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ (MG Motors), గత మార్చి నెలలో ఇండియన్ మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (2022 MG ZS EV) ని రిలీజ్ చేసిన సంగతి తెలిసినదే. అప్‌డేటెడ్ డిజైన్ ఇంకా లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చిన ఈ కొత్త మోడల్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మార్చి 2022 నెలలో ఈ కొత్త జెడ్ఎస్ ఈవీ కోసం రికార్డు స్థాయిలో 1,500 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. కొత్త 2022 MG ZS EV ని మార్చి 7వ తేదీన కంపెనీ మార్కెట్లో రిలీజ్ చేసింది.ఇండియన్ మార్కెట్లో దాని ప్రారంభ ధర రూ. 22 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.ఇక ఈ కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రిలీజ్ చేసింది. ఇందులో ఇప్పుడు 50.3 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ని వాడారు.


అంతకు ముందున్న మోడల్ తో కనుక పోల్చిచూస్తే, ఈ కొత్త మోడల్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసి అదనంగా 5.7 kWh సామర్థ్యాన్ని అందిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఈ కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఈవీ రేంజ్ కూడా బాగా పెరిగింది. ఇది పూర్తి ఛార్జ్ పై మాక్సిమం 461 కిలోమీటర్ల వరకూ రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది. ఇక పాత మోడల్ తో కనుక పోలిస్తే, ఈ కొత్త మోడల్ రేంజ్ 42 కిలోమీటర్లు ఎక్కువగా ఉంటుంది.ఇక కొత్త 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో కేవలం బ్యాటరీ ప్యాక్‌ లో మాత్రమే కాకుండా ఇంకా అలాగే కంపెనీ దాని డిజైన్ లో కూడా మార్పులు చేర్పులు కూడా చేసింది. ఇప్పుడు కంపెనీ అమ్ముతున్న పెట్రోల్ పవర్డ్ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) డిజైన్‌ ‌కి అనుగుణంగా ఉండేలా ఇక ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ స్టైలింగ్‌ను కూడా అప్‌డేట్ చేశారు. పొడిగించిన బ్యాటరీ ప్యాక్ ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ మాక్సిమం 173.6 బిహెచ్‌పి శక్తిని ఇంకా అలాగే 280 ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: