ఇండియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ ఇండియన్ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. కంపెనీ రిలీజ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు 'హీరో ఎడ్డీ' (Hero Eddy). ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైట్ వెయిట్ ఇంకా మంచి డిజైన్ కలిగి ఉంటుంది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త Eddy ఎలక్ట్రిక్ స్కూటర్ రోజూ వినియోగానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. 'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ వుంది అదేంటో తెలుసుకుందాం.'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రతి రోజు వినియోగించడానికి ఇంకా అలాగే వినియోగదారులు అవసరాలకు తగినట్లుగా ఇంకా అలాగే తక్కువ దూరం కోసం రూపొందించబడింది. కొత్త హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వచ్చేసి రూ.72,000 (ఎక్స్-షోరూమ్) గా వెల్లడించింది. ఎల్లో ఇంకా అలాగే లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.
ఇక సాధారణంగా మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనం రోడ్డుపైన నడపాలంటే తప్పనిసరిగా లైసెన్స్ అనేది అవసరం. కానీ ఈ 'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎలాంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. అంతే కాదు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ వేగాన్ని కేవలం 25 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేసింది. ఇది మిగిలిన ఎలక్ట్రిక్ బైకులకంటే కూడా తక్కువ వేగంతో పోతుంది. ఇక ఈ బైక్ ని రైడ్ చేయడానికి కూడా ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు.ఈ కొత్త 'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ ఇంకా అలాగే పరికరాలను కలిగి ఉంటుంది. ఇది మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ లో ఫైండ్ మై బైక్ ఫీచర్ వంటి లేటెస్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. కావున మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని బటన్‌ను నొక్కడం ద్వారా పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన ఈ స్కూటర్‌ను ఈజీగా కనుగొనవచ్చు.