రెనాల్ట్ ఎస్యూవి ఎలక్ట్రిక్ కార్ మాములుగా లేదుగా..

Purushottham Vinay
ఇక రోజు రోజుకి ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా ఎక్కువగా పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఫ్రెంచ్ కార్ బ్రాండ్ అయినా 'రెనో' (Renault) కూడా ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవ్వడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే , జర్మనీలో జరుగుతున్న ఐఏఏ మ్యూనిచ్ 2021 ఆటో షోలో కంపెనీ తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు రెనో మెగాన్ ఇ-టెక్ (Renault Megane E-Tech) ను ఆవిష్కరించడం జరిగింది.ఇక Renault Megane కార్ అనేది కంపెనీ ఐకానిక్ కార్ బ్రాండ్, ఇది 26 సంవత్సరాలుగా ఇంకా అలాగే నాలుగు వేర్వేరు జెనరేషన్ల పాటు కంపెనీ లైనప్‌లో ఉంది. ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన ఎలక్ట్రిక్ వెర్షన్ మెగాన్ కార్ , దాని డిజైన్ మళ్ళీ పుణికిపుచ్చుకుంది. ఇక రెనో కంపెనీ CMF-EV మాడ్యులర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌ పై రూపొందిన Megane E-Tech ఎలక్ట్రిక్ ఒక జీరో-ఎమిషన్ క్రాస్ఓవర్ అని చెప్పాలి.
ఇక Renault Megane E-TECH ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ కోసం కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ ను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఎస్‌యూవీ కార్  చౌకైన వేరియంట్ లోని ఎలక్ట్రిక్ మోటార్ ఎక్కువగా 130 హార్స్ పవర్ ల శక్తిని అలాగే 250 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ కారు లోని ఖరీదైన వేరియంట్ ఎక్కువగా 218 హార్స్ పవర్ ల శక్తిని అలాగే 300 న్యూటన్ మీటర్ల టార్క్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ కారు రెండు రకాల బ్యాటరీ సామర్థ్యాల ఎంపికతో రాబోతుంది.ఇక ఇందులో మొదటిది వచ్చేసి 40 kWh ఇంకా రెండవది వచ్చేసి 60 kWh. అలాగే కస్టమర్ ఎంచుకునే బ్యాటరీ ప్యాక్ ని బట్టి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ రేంజ్ వరుసగా 300 కిమీ ఇంకా అలాగే 470 కిమీ గా ఉంటుందని కంపెనీ వివరించడం జరిగింది.ఇక ఈ Renault Megane E-TECH డిజైన్ ను కనుక గమనిస్తే, ఈ కార్ చాలా వరకూ ఫ్లోటింగ్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: