ఇండియాలో రిలీజ్ అయిన రెనాల్ట్ కిగర్ RXT(0)..

Purushottham Vinay
ప్రముఖ ప్రెంచ్ కార్ల కంపెనీ రెనాల్ట్ ఇండియా మార్కెట్లో విడుదల చేసిన కిగర్ ఎస్‌యువికి అతి తక్కువ కాలంలోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కంపెనీ ఇండియాలో తన కార్యకలాపాలను ఏకంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఇండియా మార్కెట్లో తన రెనాల్ట్ కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) వేరియంట్ విడుదల చేయడం జరిగింది.ఇక ఈ కొత్త రెనాల్ట్ కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) ప్రారంభ ధర వచ్చేసి రూ. 7.37 లక్షలు. ఇక ఈ వేరియంట్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక రెనాల్ట్ ఇండియా  అమ్మకాలు మునుపటి నెలలో చాలా వరకు కూడా మందకొడిగా ఉండేవి. అయితే కంపెనీ దేశీయ మార్కెట్లో తన కిగర్ ఎస్‌యువిని విడుదల చేసిన తర్వాత నెలవారీ అమ్మకాల సంఖ్య మంచి పెరుగుదల దిశకు చేరింది. అయితే కంపెనీ ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ రెనాల్ట్ కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) వేరియంట్ బుకింగ్‌లు 2021 ఆగస్టు 06 నుండి ప్రారంభమవ్వడం జరుగుతుంది.

ఇక రెనాల్ట్ కిగర్ ఈ కొత్త వేరియంట్ 1.0-లీటర్ ఎనర్జీ ఇంజిన్‌తో మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో కస్టమర్స్ కి అందుబాటులో ఉంటుంది. ఇక దీనితో పాటు, రెనాల్ట్ కిగర్ కొత్త వేరియంట్ 'ట్రై-ఆక్టా' ఎల్ఈడీ ప్యూర్ విజన్ హెడ్‌లైట్లు ఇంకా 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి కొన్ని ప్రీమియం ఫీచర్లను ఈ కార్ పొందుతుంది.ఇక రెనాల్ట్ కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) వేరియంట్లో అద్భుతమైన ఫీచర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక ఇందులోని ఫీచర్లు కిగర్ అత్యంత ఖరీదైన ఆర్ఎక్స్జెడ్ వేరియంట్ నుండి తీసుకోబడటం జరిగింది.అయితే ఈ ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ ఈ కొత్త వేరియంట్ ధర అనేది తక్కువగా ఉంటుంది.ఇక చూడ్డానికి ఎంతో స్టైలిష్ గా ఆకట్టుకుంటున్న ఈ కార్ ఖచ్చితంగా కార్ లవర్స్ ని ఆకట్టుకోవడం ఖాయంలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: