బిఎండబ్ల్యూకి పోటీగా అంబాసిడర్.. వివరాలు..

Purushottham Vinay
ఇండియా మార్కెట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన కార్లలో హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ అంబాసిడర్‌ ఒకటనే చెప్పాలి.ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత  ఇండియాలో ఆటోమోటివ్ శకాన్ని సరికొత్తగా ప్రారంభించిన కారు ఈ అంబాసిడర్. అయితే తర్వాత కాలంలో ఈ కారు బిఎస్ 4 ఉద్గార నిబంధనల కారణంగా 2014లో నిలిపివేయబడింది. కానీ ఈ కారుని ఇప్పటికి మనం అప్పుడప్పుడు మన భారతీయ రోడ్లపై చూడవచ్చు.హిందుస్థాన్ అంబాసిడర్‌ ఇప్పటికీ చాలా చోట్ల టాక్సీ ఇంకా క్యాబ్‌లుగా ఉపయోగిస్తున్నారు. ఇక అంతే కాకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ కారుని ఉపయోగిస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే చాలా అంబాసిడర్ కార్లు మాడిఫైడ్ చేయబడిన వీడియోలు వెలుగులోకి రావడం చూశాము.

ఇప్పుడు కూడా ఇదే తరహాలో మరో మాడిఫైడ్ అంబాసిడర్ వీడియో ఇప్పుడు బయటపడింది.ఇక ఈ వీడియో హార్స్‌పవర్ కార్టెల్‌ అనే పేరు గల యూట్యూబ్ ఛానెల్ లో అప్‌లోడ్ చేయబడింది.ఇక ఈ అంబాసిడర్ కారును కెఎస్ మోటోస్పోర్ట్ రిస్టోర్ చేసింది. ఇక ఈ అంబాసిడర్ కారు అప్పటికంటే కంటే మరింత ఎక్కువ పనితీరు కోసం మాడిఫై చేయబడింది. కెఎస్ మోటార్‌స్పోర్ట్ ఓనర్ కరణ్ షా కారు సవరణ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అందించడం జరిగింది.ఇక ఈ అంబాసిడర్ కార్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో నిస్సాన్ ఎస్ఆర్ 20 లోని ఇంజిన్ వాడారు. ఇది 200 బిహెచ్‌పి కంటే ఎక్కువ శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది.ఇక రీస్టోర్ చేయబడిన ఈ అంబాసిడర్ కారులో నిస్సాన్ ఎస్ 13 బేస్ ఉపయోగించబడింది. అంబాసిడర్ కారు రిస్టోర్ చేయడానికి  మొత్తం అయిన ఖర్చు ఎంతంటే సుమారు రూ. 30 లక్షలట.ఇక ఈ కార్ ఏమాత్రం కూడా పెద్ద బ్రాండ్ కంపెనిలకు తీసిపోకుండా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ సరికొత్త మోడిఫై బ్రాండ్ అంబాసిడర్ కారుని మీరు చూసేయండి.


https://youtu.be/vHexAmfGcjs

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: