బెంజ్ నుంచి భారత్ మార్కెట్ లోకి అదిరిపోయే మోడల్...

Purushottham Vinay
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ భారత్ మార్కెట్లో అదిరిపోయే కొత్త  జిఎల్‌ఎ, ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35 ఎస్‌యూవీలను విడుదల చేసింది.ఇక ఈ కొత్త 2021 జిఎల్‌ఎ ధరలు రూ. 41.10 లక్షల(ఎక్స్‌షోరూమ్, ఇండియా) నుంచి స్టార్ట్ అవుతాయి.ఇక మెర్సిడెస్ బెంజ్  జిఎల్‌ఎ ఎస్‌యూవీ 200ఏ ప్రోగ్రెసివ్ లైన్, 220 డి ప్రోగ్రెసివ్ లైన్, 220 డి 4 మాటిక్ ఎఎమ్‌జి లైన్ ఇంకా రేంజ్-టాపింగ్ జిఎల్‌ఎ 35 4 మాటిక్ అనే వేరియంట్లలో దొరుకుతుంది. జిఎల్‌ఎ 200 లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది ఇది 5500 ఆర్‌పిఎమ్ తో 161 బిహెచ్‌పి మరియు 1620 ఆర్‌పిఎమ్- 4000 ఆర్‌పిఎమ్ మధ్య 250 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జిఎల్‌ఎ 200 ఏ 8.7 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం చేయగలదు. అంతే కాకుండా ఇది గంటకు 210 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఇక మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీల ధరల విషయానికి వస్తే, జిఎల్‌ఎ 220 డి రూ. 43.7 లక్షలు, జిఎల్‌ఎ 220 డి 4 మ్యాటిక్ ధర రూ. 46.7 లక్షలు ఇంకా ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35 మాటిక్ ధర. 57.3 లక్షల వరకు ఉంటుంది.ఇక బెంజ్ 200 డి ఇంకా 200 డి 4 మ్యాటిక్ విషయానికి వస్తే ఇందులో 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 3800 ఆర్‌పిఎమ్ తో 189 బిహెచ్‌పి మరియు 1600-2600 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్  టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ డిసిటి తో కూడా మిక్సయ్యి వుంది.ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ కేవలం 200 డి ఎఎమ్‌జి లైన్ ట్రిమ్ లో మాత్రమే ఫిక్స్ చేశారు.200 డి కేవలం 7.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కాగా, 200 డి 4 మ్యాటిక్ కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పొగలదు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: