ఈ టిప్స్ తో మీ బైక్ మైలేజ్ పెంచుకోవచ్చు...
పాఠశాలలు, ఆసుపత్రి, పార్కులు లాంటి జనాలు ఎక్కువగా ప్రదేశాల్లో నిర్ణీత స్పీడుతో వెళ్లాలి. మెట్రో నగరాలు, ఓ మాదిరి పట్టణాల్లో వేగం గంటకు 40 కిలోమీటర్లు దాటకపోవడం మంచిది. 40లోపు వేగంతో ప్రయాణిస్తే మైలేజి కూడా పెరుగుతుంది.ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదమే కాకుండా బైక్ కూ నష్టాన్ని కలగజేస్తుంది. దీర్ఘకాలంలో ఇంజిన్ ప్రదర్శనపై దీని ప్రభావముంటుంది. అంతేకాకుండా ర్యాష్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశమెక్కువ.చాలా మంది కొత్తగా బైక్ తీసుకుంటే వేగంగా ప్రయాణించడానికి ప్రాధాన్యమిస్తారు. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ చెయ్యకూడదు.అయితే బైక్స్ వున్నవారు ఇప్పుడు మరిచిపోతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వీసింగ్.
అవును చాలా మంది కూడా రెగ్యులర్ గా సర్విసింగ్ చేయించకుండా తమ పనిలో పడి ఈ అంశాన్ని మర్చిపోతున్నారు. ఇది బైక్ మైలేజినివ్వడంలో కీలక పాత్రపోషిస్తుంది. రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ సక్రమంగా పనిచేయడమే కాకుండా.. జీవితకాలం పెరుగుతుంది. అంతేకాకుండా మైలేజినీ పెంచుతుంది.అలాగే కార్బురేటర్ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కార్బురేటర్ పనితీరును గమనిస్తూ రీ ట్యూనింగ్ చేయించాలి. దీని వల్ల ఇంజిన్ ప్రదర్శన మెరుగై.. మైలేజీనివ్వడంలో సహాయపడుతుంది.ఇక టైరుల్లో గాలి ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.ముఖ్యంగా లాంగ్ రైడ్ లు వెళ్తున్నప్పుడు, దూర ప్రయాణాలు చేసేముందు టైర్ ప్రెజర్ ను గమనించాలి.
పెట్రోల్ కొట్టించుకునే ముందు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.ఇంజిన్ ప్రదర్శనలో ఇంజిన్ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది. తక్కువ ధరకు దొరుతుంది కదా అని ఏది పడితే వాడితే.. ఇంజిన్ పై ప్రభావం చూపిస్తుంది. ఇందుకోసం ప్రమాణికమైన ఇంజినాయిల్ వాడటం ఎంతో మంచిది.సిగ్నల్స్ వద్ద ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి రావచ్చు. అలాంటి సమయాల్లో ఇంజిన్ ఆపకుండా చాలా సేపు అలాగే ఉంచుతుంటారు. 30 సెకండ్ల కంటే ఎక్కువ సేపు ఎదురుచూడాల్సిన సందర్భాల్లో ఇంజిన్ ను ఆఫ్ చేస్తే మంచిది. దీనివల్ల ఇంజిన్ కు విశ్రాంతి దొరకడం, ఆయిల్ ఆదా అవ్వడమే కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉండి, మైలేజ్ బాగా వస్తుంది.