ఈ కారు.. కొత్త బుల్లెట్ బైక్ ధర కన్నా తక్కువకే లభ్యం..!

Kothuru Ram Kumar
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొసాగుతూనే ఉంది. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కారు కొనుకోవాలనే ఆలోచనలో ఉన్నారా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ విషయంలో మీకు సహాయపడుతుంది. సంస్థ కొత్త కార్లను విక్రయించడమే కాకుండా, ఉపయోగించిన కార్ల సంస్థ marutisuzuki truevalue పాత కార్లను విక్రయిస్తుంది. ప్రస్తుతం, SWIFT, Desire వంటి కార్లు కంపెనీ truevalue వెబ్‌సైట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్ కంటే తక్కువ ధరకే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని నిపుణులు తెలిపారు.

ఇక కంపెనీ స్టైలిస్ హ్యాచ్‌బ్యాక్ కారు Celerio యొక్క పెట్రోల్ వెర్షన్ యొక్క రెండవ విఎక్స్ఐ మోడల్ ఈ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉందన్నారు. ట్రూవాల్యూ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ కారు 2014 మోడల్. ఇప్పటివరకు 47,531 కిలోమీటర్ల వేగంతో నడిచింది. దీని ధర కేవలం రూ. 3.05 లక్షల  నిర్ణయించబడిందన్నారు. దీనితో పాటు, సంస్థ 3 ఉచిత సర్వీసింగ్, 6 నెలల వారంటీని కూడా అందిస్తోందని తెలిపారు.

అంతేకాకుండా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్ కారు Swift Dzire డీజిల్ వెర్షన్ విడిఐ కూడా ఈ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కారు 2012 మోడల్ ఇప్పటివరకు 1,21,695 కిలోమీటర్లు నడిచింది. ఈ కారును దాని మొదటి యజమాని విక్రయిస్తున్నారు. ఇక  దాని ధర కేవలం 2.36 లక్షల రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు.

ఇక కంపెనీ అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన maruti Swift పెట్రోల్ వెర్షన్ యొక్క టాప్ మోడల్ అయిన ZXI కూడా ఈ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉందన్నారు. ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కారు 2010 మోడల్, ఇప్పటివరకు ఈ కారు 70,164 కిలోమీటర్లు నడిచింది. ఈ జాబితాలో చౌకైన కారు. ఈ కారు ధర రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కన్నా తక్కువ. దీని ధర కేవలం రూ .1.43 లక్షలుగా నిర్ణయించబడిందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: