ప్రజల కోసం ఫస్ట్ రెస్పాండర్ మోటార్ సైకిళ్లను అందించిన హీరో మోటోకార్ప్ కంపెనీ...!

Kothuru Ram Kumar

భారతదేశంలో ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ రంగ సంస్థ హీరో మోటార్ కార్ప్ ఫస్ట్ రెస్పాండ్ మోటార్ బైక్లను రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని నీమ్రానా, ముండవర్ ‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లకు అందచేసింది. ఈ విధంగా మోటార్ సైకిల్స్ ను అప్పగించడం లాంటి పనులు హీరో మోటార్ కార్ప్ చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో ఇది ఒకటి.

 

 

సేవా మార్గంలో భాగంగానే ఇలాంటి ప్రత్యేకమైన వాహనాలు గ్రామీణ మరియు ఇతర మారుమూల ప్రాంతాల్లో రోగులను ఆసుపత్రులకు చేరవేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, అలాగే రోగులను అతి సౌకర్యవంతంగా సేఫ్టీ గా తరలించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయని హీరో మోటార్ కంపెనీ తెలిపింది.

 

 

ఇక ఇందుకోసం ఎక్స్ ట్రీమ్ 200 ఆర్ మోడల్ మొదటి రెస్పాండ్ వాహనాలుగా నిర్మించి, వాటికి స్ట్రక్చర్ ను అమర్చబడి పూర్తిగా డిజైన్ చేశారు. ఈ బైక్ లో ఓ వైపు పూర్తి స్ట్రెచర్‌తో అమర్చబడి, మరోవైపు ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి అత్యవసర వైద్య పరికరాలు ఈ బైక్ కలిగి ఉంటుందని తెలియజేశారు.

 

 

అంతే కాకుండా ఇందులో ఆక్సిజన్ సిలిండర్, మంటలను ఆర్పేందుకు ఉపయోగపడే సిలిండర్ లాంటి ఎన్నో ఎమర్జెన్సీ వైర్లెస్ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టం వంటివి ఇందులో రూపొందించబడ్డాయి. త్వరలో హీరో మోటార్ కంపెనీ ఫస్ట్ రెస్పాండర్ మోటారు సైకిళ్లను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని కంపెనీకి చెందిన అధికారి తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: