వామ్మో... బైక్ ధరను అమాంతం పెంచిన హీరో కంపెనీ....! ఎంతో తెలుసా...?

Kothuru Ram Kumar

కరోనా వైరస్ లాక్ డౌన్ జరుగుతున్న తరుణంలో హీరో మోటో కార్ప్ సంస్థ తన ద్విచక్రవాహనాల ధరను కొద్దిగా పెంచింది. గత సంవత్సరం నవంబరు నెలలోనే హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ మోడల్ ను BS - 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే ఎక్స్ షోరూంలో BS - 6 హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ ధర వచ్చేసి రూ.65,900 కాగా, అయితే ఇంతలోనే ఈ బైక్ కాస్ట్ ను పెంచింది హీరో సంస్థ యాజమాన్యం. అది కూడా ఏకంగా దాదాపు 2,200 రూపాయల ధరను పెంచింది. 

 


అయితే ప్రస్తుతం ఈ మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.67,100లుగా సంస్థ ప్రకటించింది. గత నవంబరు నెలలోనే BS - 6 ఫార్మాట్లో అప్డేట్ చేసినపుడే ఈ వాహనం ధరను దాదాపు 10,000 రూపాయల ధరను అమాంతం పెంచింది. ఇంతకుముందు BS - 4 మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.57,430 లుగా సంస్థ అమ్మకాలు కొనసాగించేది. అయితే ఈ సారి సరికొత్త హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ 109.15 cc నుంచి స్థానంలో 113.2 cc వరకు ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచింది కంపెనీ యాజమాన్యం. అయితే సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉంది ఈ బైక్. ఈ సరికొత్త మోడల్ 9.1 BHP బ్రేక్ హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని టార్క్ వచ్చేసి 9.89 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే స్ప్లెండర్ ఐస్మార్ట్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా ఇప్పుడు మెరుగైన మైలేజి కూడా ఇస్తుంది బైక్. భారత్ లో BS - 6 ఫార్మాట్లో మార్చిన తొలి మోటార్ సైకిల్ గా ఈ బైక్ పేరు తెచ్చుకుంది.

 


BS - 6 స్ప్లెండర్ ఐస్మార్ట్ మొత్తం మూడు కలర్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. బ్లూ, రెడ్, గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది. ఇందులో సరికొత్త డైమండ్ ఫ్రేమ్ ను కలిగి ఉన్న ఈ బైక్ డిజైన్ లో పెద్ద మార్పులేమి లేవనిచెప్పవచ్చు. ఇక పాత మోడల్ తో పోలిస్తే BS - 6 స్ప్లెండర్ ఐస్మార్ట్ 15 mm సస్పెన్షన్ ఎక్కువగా వచ్చింది. ఇక చివరగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm, 180 mm పెరిగింది. అలాగే వీల్ బేస్ కూడా 36 mm పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: