మార్కెట్ లోకి టివిఎస్ జుపిటర్ జెడ్.ఎక్స్

shami
టివిఎస్ మోటార్ వెహికల్స్ నుండి కొత్త జుపిటర్ జెడ్.ఎక్స్ వెహికల్స్ రిలీజ్ చేస్తున్నారు. టివిఎస్ జుపిటర్ జెడ్.ఎక్స్ రెండు వేరియెంట్స్ లో లాంచ్ అయ్యింది. టివిఎస్ జెడ్.ఎక్స్ జుపిటర్ డ్రమ్ అండ్ డిస్క్ వేరియెంట్స్ లో అందుబాటులోకి వస్తుంది. డ్రమ్ బ్రేక్ మోడల్ వెహికల్ 56,093 రూపాయలు కాగా.. డిస్క్ బ్రేక్ మోడల్ వెహికల్ 58,645 లుగా ఫిక్స్ చేశారు.    


టివిఎస్ జుపిటర్ జెడ్.ఎక్స్ ప్రత్యేకమైన ఫీచర్స్ తో వస్తుంది. ముఖ్యంగా ఎల్.ఈ.డి హెడ్ లైట్స్ తో పాటుగా డిజిటల్ ఎనలాగ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో ఈ వెహికల్ వస్తుంది. ఈ సరికొత్త జుపిటర్ జెడ్.ఎక్స్ రెండు కలర్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అందులో ఒకటి బ్లూ కలర్ కాగా మరొకటి రాయల్ వైన్ కలర్. 


109.7 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ వెహికల్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో 8 bhp, 8.4 nm టార్క్ తో వస్తుంది. టివిఎస్ జుపిటర్ హోండా యాక్టివాకు గట్టి పోటీ ఇస్తుంది. ఆల్రెడీ మార్కెట్ లో సక్సెస్ అయిన టివిఎస్ జుపిటర్ సరికొత్త హంగులతో జుపిటర్ జెడ్.ఎక్స్ గా తమ కస్టమర్స్ కు మంచి అనుభూతిని అందించేలా వస్తుంది.       



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: