లాంబ్రెట్టా స్కూటర్స్ రీ ఎంట్రీ..!

shami
ఇటలీకి చెందిన లాంబ్రెట్టా ఇకానిక్ మోటార్ సంస్థ నుండి త్వరలో మార్కెట్ లోకి స్కూటర్స్ రిలీజ్ కాబోతున్నాయి. 2017కు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లాంబ్రెట్టా నుండి సరికొత్త ఎలెక్ట్రిక్ స్కూటర్స్ డిజైన్ చేస్తున్నారు. ఇవి మార్కెట్ పై మంచి ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తుంది. 


లాంబ్రెట్టా మార్కెట్ లోకి మూడు కొత్త ఎలెక్ట్రిక్ స్కూటర్స్ రిలీజ్ చేయాలని చూస్తుంది. అందులో లాంబ్రెట్టా స్పెషల్ వి 450, వి 125, వి 200 తో పాటుగా 2018 లో 400 సిసి వెహికల్ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆస్ట్రియన్ టూ వీలర్ సంస్థ కిస్కా లాంబ్రెట్టా స్కూటర్ మోడల్స్ ను డిజైన్ చేస్తుంది.


ఇక ఈ స్పెషల్ మోడల్ స్కూటర్స్ 50 సిసి, 125 సిసి, 200 సిసి కెపాసిటీతో వస్తున్నాయి. 220 ఎన్.ఎం డిస్క్ బ్రేక్ తో పాటుగా 12 వోల్ట్ చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. మరి సరికొత్త లాంబ్రెట్టా ఎలెక్ట్రిక్ స్కూటర్ అనుభూతి పొందాలనుకునే వారు ఈ స్కూటర్స్ ను కొనేయొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: