రేటు పెంచిన మారుతి..!

shami
మధ్య తరగతి కార్ గా మంచి సేల్స్ కలిగిన మారుతి కార్ల విభాగంలో ఎప్పుడు ప్రయాణీకుల సౌకర్యార్ధం ఎన్నో సేవలను అందిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్ రేటు దృష్ట్యా మారుతి తన కార్ల రేట్లను కొంత పెంచినట్టు తెలుస్తుంది. ఎంట్రీ లెవెల్ కార్ల దగ్గర నుండి లక్సరీ కార్ల దాకా మారుతి అన్ని మోడల్స్ కు రేటు పెంచేశారట. 


పెంచిన మారుతి రేట్లు ఎలా ఉన్నాయంటే ఎంట్రీ లెవెల్ కార్లకు ఇదవరకు రేటు కన్నా 1500 నుండి 5000 వరకు పెంచేశారట. ఇక విటార బ్రీజా లాంటి మోడల్స్ కు అయితే ఏకంగా 20,000 ల ప్రైజ్ రేటు పెంచినట్టు తెలుస్తుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర లెక్కల ప్రకారం సంవత్సరానికి ఇలా ఒక్కసారి రేటు పెంచడం జరుగుతుంది.   


ఆర్ధిక సంవత్సర గణాంకాలకు అనుగుణంగా ఈ రేటునైనా పెంచడమే కాని కంపెనీ ఉత్పత్తులు ఇప్పటికే మంచి కస్టమర్స్ ప్రాధాన్యతను పొందాయని అంటున్నారు మారుతి అధికారులు. మరి ఈ పెరిగిన రేట్లతో సేల్స్ లో ఎలాంటి మార్పులను తెచ్చుకుంటాయో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: