కమెడియన్ అలీ సంపాదన ఆ షో తర్వాతే అన్ని కోట్లు పెరిగిందా ?
ఇక పవర్ స్టార్ సినిమా అంటే అందులో అలీ ఉండాల్సిందే అన్నట్టుగా వీరి కాంబోకు గొప్ప ప్రత్యేకత ఉంది. అంతేకాదు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న కమిడియన్స్ లో అలీ కూడా ఒకరు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో అలీ ఎన్నో వందల చిత్రాలు చేయగా... ఆయన ఇప్పటి వరకు ఎంత సంపాదించారు, ఆయన ఆస్తుల వివరాలు తెలిస్తే అంతా ఒక్కసారిగా అవాక్ అవుతారు. అలీ సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లోనూ రాణిస్తున్నారు అని సమాచారం. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా టెలివిజన్ లోనూ తరచూ కనిపిస్తూనే ఉంటారు. అలీతో సరదాగా అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా చాలా బిజీబిజీ గా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు అలీ. ఇక తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్నారు.
అలీ ఆస్తుల విలువ ఏకంగా 750 కోట్ల రూపాయలు పైగానే ఉందట. ఇక ఏడాది కి ఆయన సంపాదన 15 కోట్ల రూపాయలు అని సమాచారం. అంటే నెలకు కోటికి పైగానే సంపాదిస్తారు అలీ. ఇంద్ర భవనం లాంటి ఇల్లు, కాస్ట్లీ కార్లు, లక్సరి లైఫ్ స్టైల్. అయితే ఈయన సంపాదన మాత్ర అలీతో సరదాగా కార్యక్రమం తర్వాత భారీగా పెరిగిందట.