హద్దులు దాటుతున్న అనుపమ.. అవి చూస్తే..?

MOHAN BABU
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హద్దులు దాటుతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.  ప్రేమమ్ చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ పక్కింటి అమ్మాయిగా మారి పోయింది. గ్లామర్ షో కి, ముద్దు సన్నివేశాలకు ససేమిరా ఛాన్స్ లేదని చెప్పిన ఈ భామ ప్రస్తుతం ఈ హద్దులు చెరిపి వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అనూ కు అంతగా హిట్టు పడలేదని చెప్పుకోవాలి. ఇక చేసేదేమీలేక అమ్మడు తన గ్లామర్ ని ఎరగా వేయడానికి ప్రయత్నిస్తోందట. మలయాళం నుంచి టాలీవుడ్ లో ప్రవేశించి ఇక్కడ అగ్ర కథానాయకులు గా ఎదిగేస్తున్నారు మలయాళ బామలు. నయనతార మొదలు నిత్యామీనన్ వరకు ఈ తరహా హవా కొనసాగింది. ఇటీవల కీర్తి సురేష్,నివేద థామస్ లాంటి భామలు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు.


అయితే ఆ ఇద్దరితో పాటే రంగంలోకి దిగిన అనుపమ పరమేశ్వరన్ కెరియర్ ఆశించినంతగా సాగలేదు. ప్రేమమ్ చిత్రంతో తెలుగులో ప్రవేశించి  అరంగేట్రమే యూత్ ఫేమస్ బ్యూటీగా ఆకర్షించింది. అటుపై పలువురు అగ్ర హీరోల సినిమాలలో నటించినా కానీ ఎందుకనో అనుపమకు ఆశించినంత మైలేజ్ దక్కలేదు. అయితే ట్రెడిషనల్ విషయంలో అనుపమ పట్టువిడుపు చూపక పోవడమే తన ఎదుగుదలకు బ్రేక్ వేసిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ గుసగుస. హద్దుమీరి లిప్ లాక్ లకు, చిట్టి పొట్టి దుస్తులను ధరించేందుకు అనుపమ పరమేశ్వరన్ పూర్తి వ్యతిరేకం. కేవలం తనవైన క్యూట్ లుక్స్, నటాభినయం పై ఆధారపడి రాణిస్తోంది. అయితే ఇప్పుడు యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ రౌడీ బాయ్స్ కోసం హద్దు మీరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెదవి ముద్దులతో కుర్రకారు గుండెలను ఛీద్రం చేయనుందట . బెడ్ రూమ్ సన్నివేశాల్లోనూ ఘాటైన రొమాన్స్ తో మెరుపులు మెరిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అగ్ర నిర్మాతగా దిల్ రాజు సోదరుని కుమారుడు కొత్త హీరో ఆశీష్ తో అనుపమ ఈసారి జతకట్టింది. అర్జున్ రెడ్డి రేంజ్ లో అతడు ఈ మూవీలో లిప్ లాక్ లతో చెలరేగుతాడట. అతనితో పోటీపడుతూ అనుపమ హిటెక్కిస్తోందట. అయితే ఇప్పటి వరకు వీటి గురించి రివీల్ చేయలేదు.


ముద్దులు చాలా పచ్చిగా, ఘాటుగా ఉన్నాయని లీకులు అందుతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు షాక్ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రౌడీ బాయ్స్ చిత్రం విడుదలైన తర్వాత అనుపమ ఇమేజ్ అమాంతం మారిపోతుందని కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తొలి టీజర్ ఆకట్టుకుంది. తదుపరి ట్రైలర్ లో లిప్ లాక్ ను ఆవిష్కరించి వేడెక్కిస్తారట. యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రం కాబట్టి ఆ మాత్రం ఘాటైన సన్నివేశాలకు కొదవేమి ఉండదని చెబుతున్నారు. హుషారు ఫేమ్ దర్శకుడు శ్రీహర్ష కొంగువంటి ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: