కియా కారెన్స్ 2.0: మాములుగా లేదు.. సూపర్ ఫీచర్స్?

Purushottham Vinay
ఆటోమొబైల్ మార్కెట్లో లేటెస్ట్ సెన్సేషన్ గా దూసుకుపోతుంది కియా కంపెనీ. ముఖ్యంగా మన దేశంలో అయితే ఈ సౌత్ కొరియా కంపెనీ కార్లు కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నాయి. వినియోగదారుల నుంచి కూడా ఈ కార్లపై చాలా మంచిగా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుండటంతో ఇండియాలో ఆ కంపెనీ తన మార్కెట్ ను మరింత విస్తరించేందుకు అనేక రకాల ఏర్పాట్లని చేస్తోంది.ఈ క్రమంలో కొత్త ఫీచర్లతో తన మోడళ్లను అప్ గ్రేడ్ చేస్తోంది కియా కంపెనీ. ఇక అందులో భాగంగా కియా కారెన్స్ 2023 పేరుతో కారును మన దేశంలో సరికొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.10.44 లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. అలాగే దీనిలో ఇంజిన్, గేర్ బాక్స్ వంటి వాటిని అప్ గ్రేడ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక కియా కారెన్స్ మోడల్ లో మొత్తం ఐదు ఆప్షన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం, ప్రెస్టేజ్, ప్రెస్టేజ్ ప్లస్, లగ్జరీ ఇంకా అలాగే లగ్జరీ ప్లస్ పేరుతో ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.


వీటి ధర రూ. 10.44 లక్షల నుంచి 17.49 లక్షలు(ఎక్స్ షోరూం) దాకా ఉంది.కియా కంపెనీ తన పాత ఇంజిన్ అయిన 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని నిలిపివేసింది. దాని ప్లేస్ లో కారెన్స్ కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని తీసుకొచ్చింది. ఇది 158 బీహెచ్పీ తో 253ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఇదే ఇంజిన్ హ్యూందాయ్ అల్కాజర్ అలాగే త్వరలో రానున్న వెర్నా మోడళ్లలో కూడా వాడుతున్నారు.ఇక మాన్యూల్ గేర్ బాక్స్ కి బదులు దాని స్థానంలో కియా కారెన్స్ కారులో ఐఎంటీ క్లచ్చెస్ మాన్యూల్ తో కూడిన ఎంపీవీ ని తీసుకొచ్చింది. ఇంకా అలాగే ఏడు స్పీడ్ డీసీటీని అందిస్తుంది.ఇంకా ఈ కారెన్స్ కారులో మొత్తం ఆరు ఎయిర్ బాగ్స్ ఉంటాయి. అలాగే ఏబీఎస్, ఈఎస్సీ, హెచ్ఏసీ, వీఎస్ఎం, డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, డిస్క్ బ్రేక్స్, టీపీఎంఎస్ ఇంకా అలాగే రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇంకా అదే విధంగా 12.5 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: