మారుతి: కార్ల ధరలు భారీగా పెంపు?

Purushottham Vinay
దేశంలో కార్ల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక దీంతో కారు కొనుగోలుదారులకు చాలా భారం  పడుతుంది . ఇక దేశంలో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్న ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ జనవరి 16 వ తేదీ నుంచి కార్ల ధరలు మరింతగా పెంచడం జరిగింది.ఇక మారుతి సుజుకీకి చెందిన కార్లు ఇంకా ఎస్‌యూవీ కొనుగోలు చేయాలంటే చాలా ఎక్కువ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజీకి ఇచ్చిన సమాచారంలో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.మారుతీ సుజుకీ తన కార్ల ధరలను పెంచడం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. మారుతీ సుజుకీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ కార్ మోడళ్లలో అంచనా వేసిన సగటు సగటు పెరుగుదల మొత్తం 1.1 శాతంగా ఉందని కంపెనీ తెలిపింది. 


మారుతీ సుజుకీ తన కార్ల ధరలను పెంచే నిర్ణయం ఈరోజు నుంచి అమలులోకి వచ్చిందని అలాగే ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధరలపై ఇది వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇక దీనిలో భాగంగా మారుతి కంపెనీ అన్ని మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.ఇలా రేట్లు పెరగడానికి గల కారణం  విషయానికి వస్తే కేవలం పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని తగ్గించేందుకు తమ కార్ల ధరలను పెంచుతున్నామని 2022 డిసెంబర్‌లో మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా అలాగే దీనితో పాటు ఏప్రిల్ 2023 నుంచి అమల్లోకి వచ్చే కఠినమైన ఉద్గార ప్రమాణాల కారణంగా కూడా ఈ ధరలు పెరిగాయి.ఇక చౌకైన హ్యాచ్‌బ్యాక్ కార్లు కాకుండా.. మారుతీ కంపెనీ ఇండియాలో ఎస్‌యూవీలను కూడా సేల్ చేస్తుంది.ఇలా కార్లు ధరలు పెంచడం పై వినియోగదారులు వేరే కంపెనీ కార్లు కొనడానికి ఆసక్తి చూపించే అవకాశం వుంది. పైగా వేరే కంపెనీ కార్స్ సేఫ్టీ లోను ధరల విషయం లోనూ మారుతీ కార్ల కంటే చాలా బెటర్ గా ఉంటాయి. అందువల్ల మారుతీకి ఉన్న డిమాండ్ తగ్గే అవకాశం కూడా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: