టాటా పంచ్: గుడ్ న్యూస్.. ఇక ఆ వెర్షన్ కూడా?

Purushottham Vinay
ఇండియాలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మకుటం లేని మహా రాజుగా దూసుకుపోతున్న  'టాటా మోటార్స్' ఇప్పుడు మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది.టాటా కంపెనీ 'టాటా పంచ్' SUV ఎలక్ట్రిక్ వెర్షన్ ని విడుదల చేయనుంది.అయితే ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు  మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుంది అనే వివరాలకి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడించలేదు. కానీ ఇండియన్ మార్కెట్లో 2023 మూడవ త్రైమాసికంలో అమ్మే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. అంటే ఈ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాదికి భారతీయ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.ఇక ఈ టాటా పంచ్ ఆల్ఫా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ALFA ప్లాట్‌ఫారమ్ మల్టిపుల్ బాడీ స్టైల్స్ ఇంకా ICE, ఎలక్ట్రిక్ అలాగే హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లకు సరిపోయేలా డిజైన్ చేయబడింది.


టాటా Altroz కార్ కూడా అదే ప్లాట్‌ఫారమ్‌ మీద ఆధారపడి ఉంటుంది.రాబోయే టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు దాని స్టాండర్డ్ మోడల్  డిజైన్ పొందుతుంది. ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ లాగానే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఇక టాటా పంచ్ మైక్రో SUV మొత్తం 7 కలర్స్ (ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్, టోర్నాడో బ్లూ) లో అందుబాటులో ఉంటుంది. ఈ  కార్ సైజ్ పరంగా  అద్బుతంగా ఉంటుంది. ఈ కార్ పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు ఇంకా 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ ఇంకా అలాగే 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.ఈ కార్ డిజైన్ విషయానికి వస్తే సాధారణ టాటా పంచ్ సిగ్నేచర్ గ్రిల్ కలిగి ఉంటుంది. టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి  ఉంటుంది. టు సైడ్స్ హెడ్‌లైట్  ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. ఈ కార్ సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: