మారుతీ స్విఫ్ట్: సేఫ్టీ టెస్ట్ లో వరస్ట్ రేటింగ్?

Purushottham Vinay
ఇక ఈ ఏడాది జులైలో అమలులోకి వచ్చిన గ్లోబల్ ఎన్‌సిఎపి మరింత కఠినమైన ప్రోటోకాల్‌ల క్రింద స్విఫ్ట్, ఇగ్నిస్, ఎస్ ప్రెస్సో ఇంకా అలాగే మహీంద్రా స్కార్పియో ఎన్‌ వంటివి పరీక్షించబడ్డాయి. అయితే ఇందులో మారుతి స్విఫ్ట్ కార్ కేవలం 1 స్టార్ రేటింగ్ దగ్గరే ఆగిపోయింది. క్రాష్ టెస్ట్‌లో పరీక్షించబడిన ఈ మోడల్ ఇండియాలో తయారుచేయబడింది. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు ఇంకా అలాగే సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఉన్నాయి.ఇక మారుతి స్విఫ్ట్ అడల్ట్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో 34 పాయింట్లలకు గాను 19.19 పాయింట్లను స్కోర్ ని చేసింది. ఇంకా అలాగే అదే సమయంలో ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ ఇంకా సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో వరుసగా 6.3 పాయింట్లు ఇంకా అలాగే 12.9 పాయింట్లు వచ్చాయి. ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో మారుతి స్విఫ్ట్ డ్రైవర్ ఇంకా ప్రయాణీకుల తల అలాగే మెడకు మంచి రక్షణను అందించిందని GNCAP తెలిపింది.అయితే ఈ టెస్ట్‌లో డ్రైవర్ ఛాతీకి లభించే రక్షణ అనేది చాలా బలహీనంగా ఉన్నట్లు గుర్తించబడింది. అంతే కాకుండా డ్రైవర్ మోకాలు ఇంకా అలాగే ప్యాసింజర్ కుడి మోకాలు డ్యాష్‌బోర్డ్ వెనుక కూడా ఆశించిన రక్షణ లేదు. అయితే ప్యాసింజర్ ఎడమ మోకాలికి రక్షణ ఉన్నట్లు తెలిసింది.


దీనితోపాటు సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో, తల, ఉదరం ఇంకా అలాగే కటి రక్షణ బాగానే ఉన్నప్పటికీ.. ఛాతీకి లభించే రక్షణ చాలా తక్కువగా ఉందని ఇందులో నిర్దారించబడింది.అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో మారుతి స్విఫ్ట్ 49 పాయింట్లకు గానూ మొత్తం కూడా 16.68 పాయింట్లు స్కోర్ చేసింది. ఇక ఇందులో డైనమిక్ స్కోర్ 12.82 పాయింట్లు, ఇంకా అలాగే CRS (చైల్డ్ రెస్ట్రెయిన్ సిస్టమ్) ఇన్‌స్టాలేషన్ స్కోర్ 3.86 పాయింట్లు. ఇందులో 18 నెలల చైల్డ్ డమ్మీ ఇంకా 3 ఏళ్ల చైల్డ్ డమ్మీని ఉంచి టెస్ట్ చేశారు. ఇక ఈ రెండు డమ్మీలు కూడా వెనుకవైపు ఉన్న చైల్డ్ సీట్‌లలో ముందుకు ఎదురుగా కూర్చున్నారు.అయితే 3 సంవత్సరాల చైల్డ్ డమ్మీకి చైల్డ్ సీట్లు చాలా ఎక్కువ ఫార్వర్డ్ మూవ్‌మెంట్‌ను నిరోధించగలిగాయి, కావున చైల్డ్ తలకు మంచి రక్షణను ఇంకా ఛాతీకి కొంత వరకు రక్షణను ఇవ్వగలిగాయి. అయితే 18 నెలల డమ్మీ  తల ఇంకా అలాగే ఛాతీకి తక్కువ రక్షణ లభించింది. ఈ రిజల్ట్స్ 2018 స్విఫ్ట్ అందించే పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌ను పోలి ఉన్నట్లు అనిపిస్తుంది. స్విఫ్ట్ కార్ రెండు ఔట్‌బోర్డ్ రియర్ సీట్లకు మాత్రమే ISOFIX ఎంకరేజ్‌లను కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: