ఆ కారుకు అంత డిమాండ్ ఎందుకంటే?

Satvika
కార్ల తయారీ ప్రముఖ కంపెనీలలో ప్రముఖ కంపెనీ ఎంజీ మోటార్స్.. ఎప్పటికప్పుడు కారు ప్రియులను ఆకట్టుకోవడానికి కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎంజీ మోటార్స్ వాళ్ళు ఒకే రకం కార్లలో కొంత మార్పులు చేర్పులు చేసి మళ్లీ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది దిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ఎంజీ గ్లోస్టర్ ఎస్ యూవీని విపణిలో విడుదల చేసింది. అయితే ఆ కారు ధర వచ్చేసి రూ. 28.98 లక్షలు ఉంటుంది. మరి ఈ కారులో ఉన్న ఫీచర్లు చాలా బాగున్నాయి. ఈ కారు బయటి భాగాన్ని పరిశీలిస్తే ఎల్ఈడీ లైటింగ్, హెడ్ ల్యాంపులు, ఆటోలెవిలింగ్, ఓఆర్వీఎం, ఎంజీ లోగో ప్రొజెక్షన్లు, పానోరామిక్ సన్ రూఫ్, 19-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ ల్యాంపులు, స్టీరింగ్ అసిస్ట్ కార్నరింగ్ ల్యాంపులు మరియు డ్యూయల్ బ్యారెల్ ట్విన్ క్రోమ్ మొదలగు ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. లోపలి భాగం విషయానికొస్తే..యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు ఐస్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, లెదర్ ర్యాపెడ్ సీట్లు, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్స్ సిస్టం మొదలు ఫీచర్లను కలిగి ఉంటుంది.. వీటితో పాటుగా కారు మోటార్ భాగం కూడా చాలా ప్రత్యేకతలను కలిగి ఉంటుంది.ఎంజీ గ్లోస్టర్ ఎస్ యూవీ నాలుగు రంగుల్లో లభిస్తుంది. అగతా రెడ్, మెటల్ బ్లాక్, మెటల్ యాష్, వార్మ్ వైట్ కలర్స్ లలో అందుబాటులో ఉంది. భారత్ మార్కెట్ లో ఈ కారుకు పోటీగా మరే కారు లేదని చెప్పాలి. మహీంద్రా అల్తూరస్ జీ4, టొయోటా ఫార్చునర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి కార్లు పోటీ గా ఉన్నా కూడా ఈ కారులోకి ఈ కారు ప్రత్యేకం వెరనే చెప్పాలి.. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఈ కారు మార్కెట్ లో దూసుకుపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: