కేజిఎఫ్ హీరోయిన్ కు స్టార్ హీరోలే కావాలట ?

VAMSI
మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి మిస్ కర్ణాటకగా నిలిచిన శ్రీనిథి శెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వస్తానని ఎన్నడు అనుకోలేదట . అయితే అనూహ్యంగా అదృష్టం కేజిఎఫ్ రూపంలో ఈమె తలుపు తట్టింది. కట్ చేస్తే హీరోయిన్ గా చేసి రావడం రావడం పాన్ ఇండియా మూవీ చేసి ఎక్కడ లేని క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు న్యూ లుక్ అయితే బాగుంటుందని అనుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ , ఆ హీరోయిన్ ఫుల్ ఆటిట్యూడ్ ప్రదర్శించేలా ఉండాలని ,అలా కనిపించాలని జల్లెడ పట్టి మరి చివరికి శ్రీ నిధిని ఫైనల్ చేశారు. దారి అనుకోకుండా ఎదురయినా సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం మాత్రం ఆమె అందం, అభినయం వలనే దక్కిందని చెప్పాలి.
ఎంతోమంది హీరోయిన్లు లను చూసిన టీం ఆ తరవాత అంతా శ్రీ నిధికి ఓటు వేశారు అంటే ఈమె ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాఖీ భాయ్ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ హీరోని తన వెన్నెలతో చల్లబరిచే పాత్రలో ఒదిగిపోయింది శ్రీ. సినిమాలో ఈమె పాత్ర  తక్కువే అయినా ఉన్నంతలో తన ప్రతిభను కనబరిచింది ఈ బ్యూటీ . కేజీఫ్ చాప్టర్ 1 ఇంకా చాప్టర్ 2  లలో రెండింటిలోనూ అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార డేట్స్ దొరకడం ఇకపై దాదాపు అసాధ్యమే, అంతా బిజీ హీరోయిన్ గా మారిపోతుంది ఈ హీరోయిన్ అని అంతా అనుకున్నారు. ఎందుకంటే సాధారణంగా ఒక చిన్న సినిమా హిట్ అయితేనే ఇక ఆ హీరోయిన్ కి వరుస అవకాశాలు చుట్టుముడతాయి. అలాంటిది ఇంత పెద్ద భారీ సక్సెస్ ల తరువాత శ్రీ నిధి ఫేటే మారిపోతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు.
అయితే ఈ రెండు సినిమాల మధ్యలో కావాలంటే ఈమె మరో రెండు చిత్రాలు చేసి ఉండవచ్చు కానీ అలా ఎం జరగలేదు. సరే కమిట్ అయిన ప్రాజెక్ట్ లపై ఉన్న డెడికేషన్ అనుకున్నారు. అయితే ఆ తరువాత ఇప్పటి వరకు ఆమె నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడో కమిట్‌ అయ్యి చేసిన తమిళ మూవీ కోబ్రా మూవీ తప్ప మరో సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు . కోబ్రా చిత్రం కూడా రిలీజ్ కి రెడీగా ఉంది కానీ. శ్రీ నిధి మరో సినిమా ఏదీ చేస్తున్నట్లు కనిపించడం లేదు.  మరి అసలు విషయం ఏమిటి ఇంత పెద్ద సక్సెస్ తర్వాత కూడా ఎందుకు ఈ క్రేజీ హీరోయిన్ సైలెంట్ గా ఉందని ఆమె అభిమానులు చింతిస్తున్నారు. అయితే ఈమె మాత్రం అగ్ర హీరోలతో తప్ప చిన్న హీరోలతో నటించను అని భీష్మించుకు కూర్చోవడం వలనే  అవకాశాలు రావడం లేదని మరో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయం ఏమిటి అన్నది మాత్రం క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: