"పదేళ్ల నుండి పెళ్లి చేసుకోనిది అతనికోసమే"... యాంకర్ శ్రీముఖి కామెంట్స్?

VAMSI
మాటల గారడీతో యాంకరింగ్ లో దూసుకు వచ్చిన శ్రీముఖి తనదైన శైలిలో అభిమానులను పెంచుకుంది. యాంకరింగ్ రంగం లో సుమ కనకాల తరవాత వినిపిస్తున్న టాప్ యాంకర్ ల లిస్ట్ లో శ్రీ ముఖి పేరు ఉండనే ఉంది.
గత కొన్నేళ్లుగా యాంకరింగ్ రంగం లో చక్రం తిప్పుతున్న ఈ హాట్ యాంకర్ పెళ్లి గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కి పెళ్లి ఎపుడు అవుతుంది... ఎవరిని పరిణయం ఆడుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రశ్నను చాలా సార్లు అడిగారు కూడా. అయితే రీసెంట్ గా తన పెళ్లి గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఈ అందాల తార.
ఓ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కి విచ్చేసిన ఈ భామ తన పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఆ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమోలో శ్రీ ముఖి ఏమంది  అంటే... నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటింది.. నా ఈ ప్రయాణం లో ఎంతో మంది హ్యాండ్సమ్ హీరోలు, కో యాక్టర్‌లతో వర్క్ చేసినప్పటికీ.. ఎవ్వరికీ నా మనసు ఇవ్వలేదు. పెళ్లి ప్రస్తావన రాలేదు అంటే దాని వెనుక ఒక కారణం ఉంది..  ఇప్పటి వరకూ.. నా మెడలో మూడు ముళ్లు వేయించుకోకుండా ఉండటానికి ఓ వ్యక్తి కారణం అంటూ ఆ వ్యక్తి గురించి చెప్పబోతుంది. అయితే అక్కడితో ఆ  ప్రోమో ని కట్ చేశారు.  మరి శ్రీముఖి అసలు ఏం చెప్పాలి అనుకుంది తన కాబోయే భర్త గురించేనా.. ఇవన్నీ తెలియాలి అంటే  ఆ షో ప్రసారమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.  
ఆ షో మరేదో కాదు క్యాష్ ప్రోగ్రాం. ఈ నెల 9న ప్రసారం కాబోయే క్యాష్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో అది. అయితే ఇంతకు ముందు శ్రీముఖితో కలిసి యాంకరింగ్ చేసిన మరో యాంకర్ రవితో సో సో... ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి ఈ వార్తలు అన్నింటినీ కొట్టి పడేశారు . మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ఖరాఖండీగా చెప్పడంతో ట్రోలింగ్ చేసే వారి నోర్లు మూతపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: