ఆబార్షన్ చేయించుకుంటే నష్టాలెన్నో.......

Durga
ఈతరం యువతకు అందుబాటులో టీవీ, ఛానెళ్లు, ఇంటర్ నెట్ సాధానాలు, ఇతర సమాచార వ్యవస్థల కారణంగా టీనేజర్లకు లైంగిక సమాచారం విస్తృతంగా లభిస్తోంది. అందులోనూ యుక్త వయసులోని ఆడపిల్లలు సెక్స్ పట్ల ఎంతో ఆసక్తి కనబరచడంతో వారిలో ఆ వయసులోనే గర్భం దరించడం, అబార్షన్లు చేయించుకోవడం వంటివి సాధారణమైంది.  అయిదు సంవత్సారల కిందటి కంటే నేడు అబార్షన్ చేయించుకునే టీనేజ్ యువతుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందని ఒక స్టడి చెపుతోంది. 2007-08 సంవత్సరంలో 18 ఏళ్లలోపు యువతులు సుమారుగా 21,000 మందికిపైగా అబార్షన్ చేయించుకున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 16 ఏళ్ళలోపు వయసుగలవారి అబార్షన్లు 6.4 శాతం పెరిగినట్లు జాతీయ గణాంక సంస్థ చూపుతోంది.  గర్భనిరోథక సాధనాలు, లైంగిక విద్య స్కూళ్లలో ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నప్పటికీ వీటి ప్రభావం టీనేజ్ యువతులపై తక్కవగా ఉంటుంది. గతంలో అబార్షన్ అంటే భయపడేవారు. తప్పుగా భావించేవారు. కానీ నేడ అధునికంగా పరిస్థితిమారి అబార్షన్లు అధికమవడం మంచి సూచనేనని బ్రిటీష్ ప్రెగ్నన్స్ ఎడ్వైజరీ సర్వీస్ తెలిపింది. ఏదిఏమైనప్పటికీ పిల్లలు ఏమి తెలియని తమ టీనేజ్ లోనే రతిక్రీడలాచరించడం, ఫలితంగా గర్భం పొంది దానిని అబారషన్ చేయించుకోవడం వంటివి వారి వారి వయసుకు తగని చర్యలే, కనుక ప్రభుత్వాలు, పిల్లల తల్లిదండ్రులు ఈ అంశంలో మరింత జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు సరైన సమాచారం ఇవ్వడమే కాక, ఇటువంటి చర్యలను ప్రోత్సహించరాదని కూడా ఈ సంస్థ సూచనలిచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: