ఒత్తిడి వేదిస్తుదా?

Durga
మధ్యవయసు మహిళలు చాలా తొందరగా ఒత్తిడికి గురవుతారు. తరచుగా వారి ప్రమేయం లేకుండానే ఆందోళన వేధిస్తుంటుంది. దాంతో వారు ఏపని చేయలేక, ఏదో కోల్పోయిన భావనతో నిస్తేజంగా ఉంటారు. మధ్యవయసులో వచ్చే శారీరక మార్పులు, కుటుంబ సభ్యుల ప్రవర్తనను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మరింత ఇబ్బందికి లోనవుతారు. నిత్యజీవనంలో చిన్నచిన్న మార్పులు చేయడం ద్వారా వాటిని అధికమించడానికి ప్రయత్నిచవచ్చు. డిప్రెషన్ కి గురవుతున్నామని ఏమాత్రం అనిపించినా జీవన విధానాన్ని మార్చాలి. రొటీన్ కి భిన్నంగా కొత్తకోణంలో చూడాలి. అర్థంలేని ఆలోచనలు కట్టిపెట్టి కొత్త కొత్త వంటలు చేయడం, ఇంటిని సర్థడం, లాంటి పనులు చేయడానికి ప్రయత్నించాలి. ఆందోళనగా అనిపించినప్పుడు ఇష్టమైన సాహిత్యాన్ని చదవడం, సంగీతాన్ని వినడం అలావాటు చేసుకోవాలి. ఆలోచనలు ఆపి హాస్య చిత్రాలు చూస్తే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఇంట్లో పనులన్నిటినీ తామె చేయాలనే ఆలోచనకు స్వస్తీ చెప్పడం మంచిది. ఇతర కుటుంబ సభ్యులకు కొన్ని బాధ్యతలు అప్పగించి పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. స్వవిషయాలపై ఆసక్తి పెంచుకోవాలి, అందంగా తయారవడానికి ప్రాధాన్యతనివ్వాలి. మేకప్, డ్రస్లు, నగలు పట్ల శ్రద్ద తీసుకుంటే కొంచెం ఉత్సాహంగా వుంటుంది. ఏ విషయంలోనూ ఇతరులతో పోటీ పడకూడదు. ఉన్నదానిలో సంతృప్తిగా జీవించడానికి శ్రమ కలిగించే పనులు చేయడం తాత్కాలికంగా మానేయాలి. మధ్య వయసు మహిళలు ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది పిల్లల చదువుల విషయంలోనే పిల్లల భవిష్యత్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులపై చిరాకుపడకుండా సరదాగా ఆనందంగా సమయం గడపడానికి ప్రయత్నించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: