చిరంజీవి "భోళా శంకర్" మూవీ కేవలం ఎన్ని రోజుల షూటింగ్ పెండింగ్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ హీరోగా రూపొందిన వేదాలం అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో సైరా నరసింహా రెడ్డి అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతుంది. ఈ మూవీ లో శ్రీ ముఖి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. చిరంజీవి ... శ్రీ ముఖి ల మధ్య ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

పవన్ హీరోగా రూపొందిన ఖుషి మూవీ లోని నడుము సన్నివేశాన్ని ఈ సినిమాలో చిరంజీవి ... శ్రీ ముఖి పై చిత్ర బృందం ఇప్పటికే తేరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశం కూడా చాలా అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. ఈ మూవీ కి మహతీ స్వర సాగర సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ కేవలం 30 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  30 రోజుల షూటింగ్ తో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: