ట్రైన్ లో ఒంటరిగా వెళుతున్న స్త్రీ... ఈ రూల్స్ గురించి తెలుసా?

VAMSI
రైళ్లల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఈ విషయాలను తప్పక తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో చూద్దాం పదండి. మహిళల రక్షణ కొరకు ఎన్నో రకాల చట్టాలు రూపొందించబడ్డాయి. అందులోనూ మహిళలకు అత్యదిక ప్రాధాన్యం ఇచ్చే మన భారత దేశంలో మహిళలకు వెసులుబాటు సౌకర్యాలు చాలానే ఉన్నాయి. మహిళలు కొన్ని సార్లు ఒంటరిగా ప్రయాణించాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఒకవేళ వారు కనుక రైలులో ప్రయాణించాల్సి ఒంటరిగా లేదా తమ పిల్లలతో ప్రయాణించాల్సి వస్తే ఈ చట్టాలు గురించి అవగాహన ఉండటం ఉత్తమం. 1989 నాటి కాలం లోనే ఒంటరిగా ప్రయాణించే మహిళల కొరకు వారి రక్షణగా నిలిచేలా కొన్ని చట్టాలను రూపొందించారు సర్కారు వారు.
ఆ చట్టాలను వినియోగించుకుని మహిళలు రక్షణను పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు భారతీయ రైల్వే యాక్ట్ 1989 లోని సెక్షన్ 139 ప్రకారం ఒక మహిళా ప్రయాణికురాలు పురుషుల తోడు లేకుండా ఒంటరిగా లేదా తన బిడ్డలతో ప్రయాణిస్తున్నట్లయితే, ఆమెకు రైల్వే పాస్ లేదా టికెట్ లేదన్న కారణంతో రాత్రి సమయంలో రైలు నుంచి దిగమని రైల్వే సిబ్బంది చెప్పడం నేరం. ఒకవేళ రైల్వే అధికారుల దగ్గర మహిళా కానిస్టేబుల్ ఉన్నట్లైతే రైలు నుండి దింపే అవకాశం ఉంది. కేవలం మహిళల కోసం రైలు లో సెపరేట్ గా ఒక భోగి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీన్ని లేడీస్ కంపార్ట్మెంట్ అంటారు. భారతీయ రైల్వే యాక్ట్ 1989 లోని సెక్షన్ 162 ప్రకారం ఈ బోగీలో పురుషులు ఎక్కడానికి అస్సలు అనుమతి లేదు. అయితే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయి మాత్రం ఈ బోగీలో ప్రయాణించడానికి అనుమతి ఉంది.
హైదరాబాద్ టు తిరుపతి టూర్... తెలంగాణ టూరిజం ప్యాకేజీ లు మహిళల కోసం రూ.4,000 లోపే కలెక్ట్ చేస్తున్నాయి.  అంతే కాకుండా భారతీయ రైల్వే మహిళలకు ఇలా ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. రైల్వే బెర్తుల్లో  మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఉంది. అంతే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్లే స్లీపర్ క్లాస్ బోగీల్లో అయితే ఏకంగా ఆరు బెర్తులు వరకు కేవలం మహిళా ప్రయాణికులకు కేటాయించింది.  
 
ఇక మహిళల భద్రత, రక్షణ కోసం నిత్యం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మహిళా సిబ్బందితో రైళ్లల్లో తనిఖీలు చేస్తూ ఉండటం మరొక ప్రత్యేక రక్షణ. మరియు మహిళా రక్షణే ప్రధానంగా భావించి రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లల్లో కూడా పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. మహిళలతో పాటు రైల్వే ప్రయాణికుల కోసం 139 ఇండియన్ రైల్వేస్ హెల్ప్‌లైన్ నెంబర్‌ను 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది అన్న విషయం తెలుసుకోండి. అదేవిధంగా మహిళలకు,లేదా ఏదైనా ప్రమాదం చేతనైనా రైలు లో చైన్ ను లాగి ట్రైన్ ను ఆపవచ్చు అయితే కారణం మాత్రం బలమైనదై ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: