అమ్మ: ఆడపిల్లలకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలివే..?

N.ANJI
చాలా మంది చిన్న పిల్లలను దేవుళ్లుగా భావిస్తుంటారు. బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటుంటారు. అందుకే చిన్న పిల్లలు చెప్పిన ప్రతిమాటను ఇంట్లో అందరూ పాటిస్తుంటారు. మగపిల్లల కంటే.. ఆడ పిల్లలను ఎంతో ఆప్యాయతగా చూసుకుంటారు. ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టినట్లు భావిస్తారు. తల్లికి కొడుకంటే ఎంతో ప్రేముంటదో.. తండ్రికి కూతురంటే అంత ఇష్టం. ఆడపిల్లల జీవితంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమైనదనే చెప్పుకోవచ్చు. అందుకే ఆడపిల్లలు తల్లులను అనుసరిస్తారు. అనేక విషయాలను నేర్చుకుంటారు. ఆడపిల్లలకు జీవిత పాఠాలు నేర్పించడం చాలా అవసరం. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను కాపాడుతూ వస్తున్నారు కానీ.. ఛాలెంజింగ్ ఎదిగేందుకు తోడ్పాటును అందించడం లేదు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మహిళ ధైర్యవంతురాలవుతుంది.
ఆడపిల్లలకు ప్రేమ, కరుణ చాలా అవసరం. కొన్ని విషయాలను ఆడ పిల్లలతో షేర్ చేసుకోలేము. అలాంటి విషయాలను వ్యక్తికరించవచ్చు. ప్రేమను ఎంతగా ఇవ్వాలి. ఎవరితో కరుణతో మెలగాలనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఆడపిల్లలకు తమ తండ్రి ఎంత ఇష్టమైనా.. స్త్రీ అనే భావన కారణంగా కూతుళ్లు తమ తల్లినే రోల్ మోడల్‌గా తీసుకుంటారు. అందుకే తల్లులు మీ కూతురిని కష్టపడే గుణాన్ని అలవర్చాలి. కలలు, లక్ష్యాలను ఎప్పటికీ వదులుకోవద్దనే ధైర్యాన్ని ఇవ్వాలి. తనని తాను తెలుసుకునేలా ప్రయత్నించాలి. ఇతరులను అర్థం చేసుకోవడం, ఆదరించడం వంటి లక్షణాలు నేర్పించాలి.
ఆడ పిల్లలు తమ బాధ్యతలను తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. దానికి అవసరమైన స్వేచ్ఛను తల్లిదండ్రులు కల్పించాలి. ప్రపంచం కేవలం నాలుగు గోడలకే పరిమితం కాదని, బయట వేరే ప్రపంచమే ఉంటుందని ధైర్యాన్ని నింపాలి. ప్రతిఒక్కరికి జీవితంలో ఇలా.. ఈ స్థాయిలో బతకాలనే ఆలోచనలు ఉంటాయి. వారి కలల్ని నాలుగు గోడలకే పరిమితం చేసినట్లయితే.. జీవితాంతం బాధపడతారు. అందుకే వారికి స్వేచ్ఛను కల్పించాలి. సమాజంలోని ఒడిదుడుకులను ఎదుర్కొనేలా ధైర్యాన్ని ఇవ్వాలి. ఎల్లప్పుడూ మేమున్నామనే నమ్మకాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలి. అప్పుడే మీ పిల్లలు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: