మహిళలు "బెల్లీ"తో ఇబ్బంది పడుతున్నారా?

VAMSI
చాలా మంది మహిళలు ఒక వయసు వచ్చాకో లేదా పిల్లలు పుట్టిన తరువాతనో బరువు పెరగడం సహజం. ముఖ్యంగా చాలా మంది ఆడ వారికి బెల్లీ కూడా బాగా పెరుగుతుంది. దానివల్ల వారు నలుగురిలో తిరగలన్నా..మోడ్రన్ దుస్తులు వేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. బరువు తగ్గాలని, బెల్లీని తగ్గించుకోవాలని డైటింగ్ లని, వ్యాయామాలని ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ అందరికీ ఆశించిన ఫలితం వస్తుందని చెప్పలేము. ఎందుకంటే శరీర బరువు తగ్గడానికి ఒక చక్కటి ప్రణాళిక అనేది తప్పకుండా అవసరం. ఒక ప్రణాళిక ప్రకారం ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. అయితే బరువు తగ్గడానికి కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్న సలహాలను తెలుసుకుందాం.
 ముఖ్యంగా మహిళలు ఇది మీకోసమే ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.
* ప్రతి రోజు ఉదయాన్నే కనీసం ఒక కిలో మీటర్ అయినా నడవాలి. లేదా వీలైతే కాసేపు రన్నింగ్ చేయండి.
* ఉదయం టిఫిన్ కి బదులుగా ఒక కప్పు స్ప్రౌట్స్ అలాగే ఒక ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ తీసుకోవాలి. ఒకవేళ కాస్త కడుపు నిండేలా కావాలి అంటే రెండు బ్రెడ్ ముక్కలను తినొచ్చు.
* ఖచ్చితంగా ఒక అరగంట సేపు అయినా వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.
* నూనెతో వండే పదార్థాలను తక్కువగా తినాలి. కూరగాయలను నూనెలో వేయించి తినడం కన్నా ఉడికించి తినడం వలన బరువు తగ్గడమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
* వీలైనంత వరకు నీళ్ళు ఎక్కువగా తాగాలి. కనీసం ఒక రోజులో ఏడెనిమిది గ్లాసులు నీరైనా తాగాలి.
* నిద్రపోవడానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. అపుడే అది జీర్ణం అవుతుంది. ఆహారం తిన్న ఒక పదినిమిషాలు తర్వాత కాసేపు అలా నడవాలి.
ఇలా మీ ప్రణాళికను క్రమం తప్పకుండా పాటించడం వలన త్వరగా బరువు తగ్గుతారు..అలాగే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బెల్లీ కూడా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: