మహిళ: వంటింట్లో పాటించాల్సిన చిట్కాలు...

VAMSI
మహిళలకు ఇంట్లో వంటిల్లు చాలా ప్రత్యేకం అది వారి సామ్రాజ్యం. వంట విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు చేసే వంటలు అందరూ ఇష్ట పడాలని కుటుంబ సభ్యులంతా అందంగా తినాలని అనుకుంటారు. దానికి బదులుగా వంట బాగా చేశావ్..అన్న ఒక చిన్న మాటను మాత్రమే ఎదుటి వారి నుండి ఆశిస్తారు. అయితే ఈ ఒక్క మాట కోసం, వారి వారంతా సంతోషంగా కడుపు నిండా భోజనం చేయాలంటే..వంటలు బాగా రుచికరంగా రావాలి. అందుకే వారుఎంత కష్టమైన ఇష్టంగా ఎన్నో వంటలను చేస్తారు. అయితే చాలా మందికి ఒకసారి చేసిన వంటకం రుచి మరోసారి రాదు. ఇది రెగ్యులర్ గా చాలా మంది ఎదుర్కొనే ఒక చిన్న సమస్య. ఒకసారి ఎంతో అద్భుతంగా వచ్చిన వంట.. అదే వంట అదే వ్యక్తి చేస్తే మరోసారి ఆ రుచి రాదు.
ఇది చాలామంది మహిళలు ఎదుర్కొనేదే. అయితే ఇక్కడ అసలు కారణం చేసే చేయి ఒకటే, పదార్దాలు ఒకటే కానీ ఆ పదార్థాల పరిమాణం వాటిని వేసే వరుస క్రమం మిస్ అవ్వడం ద్వారా ఆ వంట ఎప్పుడు ఒకేలాగా రాదు. కాబట్టి మీరు ఒక వంట కోసం ఒక బుక్ ను మెయింటైన్ చేయడం మంచిది. మీకు వంట బాగా కుదిరింది అనిపించినపుడు వెంటనే ఆ వంటలో వాడిన పదార్దాలు వాటి క్వాంటిటీ, అలాగే వాటిని వాడిన క్రమాన్ని జస్ట్ ఒక చిన్న నోట్ రాసుకుంటే చాలు. మరోసారి అదే వంట చేసేటపుడు ఒక్కసారి జస్ట్ అలా ఆ పేజ్ తిరగేస్తే అదే టేస్ట్ తో మీ వంట రెడీ అయిపోతుంది. లేదంటే మర్చిపోతాం.
ఒకవేళ మరీ ఖచ్చితంగా అదే రుచి రాకపోయినా దాదాపుగా అదే టేస్ట్ వస్తుంది. ఏ వంట అయినా సరే ఉప్పు, కారం సరిగ్గా పడినపుడే ఆ వంటకానికి మంచి రుచి అనేది వస్తుంది. వంట ఏదైనా ఉప్పు, కారం సరిగ్గా పడితేనే దాని టేస్ట్ సూపర్బ్ గా వస్తుంది...లేదంటే చప్పగా..రుచిపచి లేకుండా ఉంటుంది. అందుకే వంట చేసే సమయంలో మన దృష్టిని వంటపైనే ఉంచాలి అలా కాకుండా మనసు ఎక్కడో పెట్టి మరేదో ఆలోచిస్తూ వంట పదార్దాలు ఎక్కువ తక్కువ వేస్తే  ఆ వంటకం రుచే మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: